‘#RRR’- ఎనీ డౌట్స్?

Header Banner

‘#RRR’- ఎనీ డౌట్స్?

  Thu Mar 22, 2018 21:03        Cinemas, India, Telugu

 

 

 

‘బాహుబలి’ తర్వాత దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి చేయబోయే చిత్రం ఏమిటనే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లతో రాజమౌళి మల్టీస్టారర్ చిత్రం చేయబోతున్నాడనే వార్తలు వచ్చినప్పటికీ.. కొంతమంది నమ్మలేకపోతున్నారు. కారణం ఈ కాంబినేషన్ సాధ్యమేనా అనే డౌట్స్ కొందరిలో ఉన్నాయి. ఒక్క ఫొటోతో ఎటువంటి సమాచారం లేకుండా రాజమౌళి మల్టీస్టారర్ చిత్రం చేస్తున్నాడని ఎలా నమ్మేది అని కొన్ని రోజుల క్రితం వరకు కొందరు వాదించారు. అయితే సాయిధరమ్ తేజ్ ఈ కాంబినేషన్ గురించి రివీల్ చేయడం, ఆ తర్వాత ఎన్టీఆర్, చరణ్ కలిసి ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమివ్వడం వంటివి ఈ మల్టీస్టారర్ మూవీ గురించి వస్తున్న వార్తలు నిజమనేలా చేశాయి.

 

అయితే తాజాగా ఈ సినిమా పక్కాగా తెరకెక్కబోతుందనే విషయం తెలియజేస్తూ.. చిత్రాన్ని నిర్మిస్తున్న డి.వి.వి. ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్ ఒక చిన్న క్లిప్‌ని విడుదల చేసింది. #RRR అంటూ మూడు ఆర్‌లకు ఉన్న పేర్లను రివీల్ చేస్తూ ఈ క్లిప్ ఉంది. ‘ఆర్- రాజమౌళి, ఆర్- రామ్ చరణ్, ఆర్- రామారావు...’ ఈ కాంబినేషన్‌ కోసం వెయిట్ చేస్తున్న వారందరి కోసం అంటూ విడుదల చేసిన ఈ క్లిప్‌తో అనుమానాలకు తెరదించేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంకా ఎనీ డౌట్స్ అనేలా ఉందీ క్లిప్. అలాగే ఈ విషయంని కన్ఫర్మ్ చేస్తూ.. రాజమౌళి కూడా రీ ట్వీట్ చేశారు.

 


   ‘#RRR’- ఎనీ డౌట్స్?