అత్యంత ప్రమాదకర విషయాన్ని బయటపెట్టిన శివాజీ!

Header Banner

అత్యంత ప్రమాదకర విషయాన్ని బయటపెట్టిన శివాజీ!

  Thu Mar 22, 2018 21:01        అమరావతి కబుర్లు, India, Telugu

 


 

ఆపరేషన్ ద్రవిడలో భాగంగా ఓ జాతీయ పార్టీ.. ఏపీ కోసం ఆపరేషన్ గరుడను పక్కా ప్లాన్‌తో నిర్వహిస్తున్నారని నటుడు శివాజీ చెబుతున్నారు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

 

జాతీయ పార్టీ..(ఆపరేషన్ ద్రవిడ)

ఏపీకి- ఆపరేషన్ గరుడ

 1. i) ధికార పార్టీ :-ఈ పార్టీని ఎలా ఇబ్బంది పెట్టాలి అనే దానిలో భాగంగా (1). సీబీఐ కేసులు రీఓపెన్ చేయడం. కొత్త నాయకుడు లోని రెండో పార్ట్‌కు చెందినవారు.. ఢిల్లీలో కూర్చోని ఈ కేసులను ఓపెన్ చేసే పనిలో ఉన్నారు (వీళ్లకు రాజకీయాలతో అసలు సంబంధం లేదని ప్రస్తుతం చెబుతున్నారు).

 

(2). ఆర్థికంగా దెబ్బతీయడం పార్టీకి చెందిన నేతల వ్యాపారాలను దెబ్బతీయడం, చక్రబంధం చేయడం తద్వారా ఆ మనిషిని ఒంటరిచేయడం ఆఖరికి ఈ అధికార పార్టీని నిర్వీర్యం చేయడం. ఇది కాస్త ఆశ్చర్యకరంగానే ఉండొచ్చు.

 

(డీల్ చేసేదెవరంటే):-

నంబర్ మూడులోని..ఇలా అలర్లు చేయడం వల్ల అధికారపార్టీ (1) ఇబ్బందుల్లో పడుతుంది. దీంతో అధికారపార్టీలోని సీబీఐ కేసులు, ఆర్థికంగా పూర్తిగా నిర్వీర్యమవుతూ ఉంటారు.

 

 1. ii) కొత్త నాయకుడు :-అన్నింటి కంటే ప్రమాదకరమైన విషయం తెలియదు. పద్మవ్యూహంలోకి రావడమే తప్ప బయటికి వెళ్లడం ఎవరికీ తెలియదు. ఈ వ్యూహంలో అందరూ అభిమన్యులే.

(1). స్థానికంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం

 

(2). ప్రజలకు సంకేతాలు ఇవ్వడం

రాష్ట్రం పట్ల ఎంతో బాధ్యత ఉన్నట్లు.. ఆ బాధ్యతలో భాగంగా ఆయన కొన్ని పరిశోధనలు చేయడం.. ఆ పరిశోధనలకు సమాజం పట్ల ప్రేమ ఉండి ఒలకబోసి మేం రాజకీయాల నుంచి వెళ్లిపోయామని చెప్పుకునే వ్యక్తులను.. కొత్త నాయకుడు తీసుకుంటారు. పాపం ఇదంతా పెద్ద ఆపరేషన్ అని వారికి తెలియదు. అసలు ఇందులో జోక్యం చేసుకున్నామనే విషయం కూడా తెలియదు. కొత్తనాయకుడు గనుక పార్టీలో చాలా పదవులు ఉంటాయనే ఆశతో ఇవన్నీ చేసిండొచ్చు.. (ఇది నేను అర్థం చేసుకున్నది మాత్రమే) ఇందులో ఇద్దరు విశ్రాంత ఐఏఎస్‌‌లు.. ఒక సీనియర్ పాత్రికేయుడు ఉంటారు వీరంతా కలిసి కొత్త నాయకుడికి సహకరిస్తుంటారు.. ఎలా ఇబ్బంది పెట్టాలి.. ఏం చేయాలనే సలహాలు కూడా ఇస్తుంటారు. ఇందులో ఉండేవారంతా బలి పశువులే. చివరికి కొత్తనాయకుడి దగ్గరికొస్తే ఏదో ఉంటుందిలే అని వచ్చామని మోసపోతారు. వీళ్లకు స్వార్థం ఉంది (మన తెలుగువాళ్లకుండే స్వార్థాన్ని మెయిన్ జాతీయపార్టీ వాడుకుంటోంది.)

 

iii) ఇంకో ముఖ్యమైన పార్టీ :-

ఈ పార్టీకి చెందిన నేతకు బలవంతంగా పెట్టిన కేసులు కావచ్చు. సంబంధంలేని కేసులు కావచ్చు. ప్రాంతీయ పార్టీల్లో సహజంగా ఉండే బంధుప్రీతి, అవకాశం అన్నీ కలుపుకుని ఏమైనా కొన్ని సంపాదనలు జరిపివుండొచ్చు.. జరపకపోయిండొచ్చు. కానీ నేరం నిరూపితం కానంత వరకు ఆయన నిర్దోషే.

 • అయితే ఈ మొత్తం ఆపరేషన్‌‌కు అసలు బలిపశువులు వీళ్లే. చాలా ఈజీగా జాతీయపార్టీకి దగ్గరయ్యామని అనుకుంటున్నారు కానీ అసలు విషయం అవునా మీరే ఆశ్చర్యపోతారు. వీళ్లకు కొంతమంది దారులు తెరిచారు.
 • మీరు ఆశ్చర్యపోయే విషయమేమిటంటే.. అధికార పార్టీలోని ఓ కోవర్టు.. ముఖ్యపార్టీలోని ఓ వ్యక్తిని జాతీయ పార్టీలోకి తీసుకెళ్లడానికి రూట్ ఓపెన్ చేశారు. కాగా అధికారపార్టీలోని కోవర్టు.. ముఖ్యపార్టీలోని వ్యక్తి కలిసిన ప్రాంతం చెన్నై.
 • ఈ ముఖ్య పార్టీ నాయకుడి మీద గుంటూరు, హైదరాబాద్‌‌లో ఇలా రెండుసార్లు రెక్కీ కూడా నిర్వహించడం జరిగింది. పకడ్బంధీగా ప్రాణహానీ లేకుండా దాడులు జరపడం. ఆ ప్రాణహానీ లేని దాడులతో ఆంధ్రప్రదేశ్‌లో అలజడులు మొదలవుతాయి. అనంతరం ఈ అలజడులతో కొన్ని ఊరటలు లభిస్తాయి. ఇప్పటికీ ఆ ముఖ్య నాయకుడు అమాయకుడే.. కానీ అదే పార్టీలో ఉన్న మరో వ్యక్తి చాలా తెలివినోడ్ని అని చెప్పుకోవడం అమాయత్వం. అసలు పని అంతా జతీయ పార్టీ నుంచే జరుగుతోందని ఈ ముఖ్యపార్టీ వాళ్లకు అసలు తెలియదు.
 • అయితే ఈ ముఖ్యనేతకు పూర్తి ఊరట రాదు.. దీంతో చాలా వరకు పెండింగ్‌లోనే ఉంటాయి. ఇక్కడ జరిగిన దాడులను (1)రాయలసీమకు చెందిన ఓ ముఖ్యనేత కుటుంబంపై నెట్టడం ఒక ఆలోచనయితే.. (2) మొదటిది జనాలు ఎలాగో నమ్మరు గనుక ఏపీలో అల్లర్లు పుట్టిస్తారు. ఈ అల్లరి మూకలన్నీ బీహార్, ఒరిస్సాకు చెందిన స్లీపర్ సెన్స్. (ఎవరో ఏంటో తెలియదు).

ఆఖరి ఘట్టం:- ఈ ఆపరేషన్‌‌లో అతి ముఖ్యమైన రోజు సెప్టెంబర్ 01. అధికార పార్టీ అనగా ప్రభుత్వాన్ని డిస్వాల్వ్ చేయడం. రాజకీయాల్లో మొట్టమొదట ఏపీ ముఖ్యమంత్రిగా ఎప్పుడైతే అదే రోజన జాతీయ పార్టీ టార్గెట్‌గా ఎంచుకోవడం జరిగింది.

 

ముఖ్యంగా జరిగేవి..

 • (2) కొత్త నాయకుడికి సంబంధించిన సోషల్ మీడియా టీం (1)లోని అధికార పార్టీని దెబ్బతీయడం.. చాలా విషయాలను బయటపెట్టడం ఇలాంటవన్నీ చేస్తారు. అయితే కొత్తపార్టీ నాయకుడు కావాల్సిందే ఇరుక్కోలేదు.. అనుకోకుండా వచ్చి ఇరుక్కుపోయాడంతే.. బయటికెళ్లడం మాత్రం సాధ్యం కాదు.
 • అధికార పార్టీ డిసాల్వ్ అయిన తర్వాత ఇక తదుపరి పని కొత్తనాయకుడిదే. ఎన్నికలు జరుగుతాయ్.
 • ఇందులో ముఖ్యనాయకుడి పార్టీ, కొత్తనాయకుడి పార్టీకి సీట్లు వస్తాయి.
 • అయితే ఇందులో ముఖ్య పార్టీ నాయకుడిపై ఉన్న కేసుల్లో లోపలికి వెళ్లిపోతాడు. దీంతో ముఖ్య పార్టీ పని కూడా అయిపోతుంది.
 • దీంతో అప్పటికే నిర్వీర్యమైన అధికార పార్టీలోని నేతలంతా 2, 3 పార్టీల్లో చేరతారు. తద్వారా ప్రభుత్వాన్ని ఈజీగా తమ చేతుల్లోకి తీసుకోవచ్చు.
 • అయితే కొన్ని ఒత్తిళ్ల ద్వారా కొత్త నాయకుడి పార్టీకి చెందిన కీలక వ్యక్తిని కేంద్ర మంత్రిగా పంపిచాలని చూపిస్తారు. అయితే ఆ పనికి ఒప్పుకోరు.. అంతకముందు ఏ పనైతే పాత రోజుల్లో చేసుకుంటున్నారో తిరిగి అదే పనికి వెళ్లిపోతారు.
 • మొత్తం మీద ముఖ్యమంత్రి ఎవరంటే.. మన తెలుగు వ్యక్తే ఈ పేరు మనందరికీ తెలుసు. దీంతో ఆపరేషన్ ఆపరేషన్ గరుడ’ పూర్తవుతుంది.
 • ఇది నాకు తెలిసిన విషయాలు. ఆరునెలల క్రితమే లీక్ చేశాను. మీరెవ్వరూ నమ్మలేదు. కానీ ఇవాళ జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే ఇది అక్షర సత్యం.

ఇలా కూడా జరగొచ్చు..!

ముఖ్య పార్టీ:-

అయితే ఇందులో.. ముఖ్య పార్టీ తమపై జరిగే దాడులను ఆపుకోవచ్చు. అంతేకాదు వీళ్లకు తెలిస్తే కచ్చితంగా వార్ని అనుమానించడం ప్రారంభిస్తారు. అది అసలు ఆపరేషన్ అని కూడా చెబుతారు.

 

కొత్తనాయకుడు:-

 • ఇతను స్వతహాగా మంచి మనిషి.. అత్యాశలేనటుంటి వారు. అందులో ఎటువంటి సందేహం లేదు.
 • ఇవన్నీ అటుంచితే.. (2) కొత్తనాయకుడుగా ఉన్న వ్యక్తిని మాత్రం నేను అభిమానించినంతగా వేరేవాళ్లు అభిమానించివుండరు. అంతేకాదు.. ఇతను ప్రత్యేక హోదాను నిర్వీర్యం చేయడం కూడా.

అధికార పార్టీ:-

ఇప్పుడు విషయం తెలిసింది గనుక సింపుల్‌‌గా కొట్టిపారేయచ్చు.. ఊహాగానమని కూడా చెప్పుకోవచ్చు కానీ ఈ రాష్ట్రాన్ని కాపాడాలి గనుక చెబుతున్నాను.

 

నేనేవరి పేర్లను చెప్పలేను.. మీకు అర్థమైతే అర్థం కాని వాళ్లకు చెప్పడానికి ప్రయత్నం చేయండి అని విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి దయచేసి మనందరం కొట్టుకుందాం.. అందరం ఒక్కటై ఈ దుర్మార్గమైనటువంటి జాతీయ పార్టీల మోజులో పడొద్దు. నాకు ఏ పార్టీపైనా ఎలాంటి మోజు, ఇష్టం అని లేదు. నాకు తెలిసింది మీకు చెప్పాను.. అంతా మంచే జరగాలని నేను కోరుకుంటున్నాను. తదుపరి నిర్ణయాలన్నీ మీవే. అంతేకాదు అది ఎలా అయింది.. ఇదెలా అని నన్ను దయచేసి అడగొద్దు ప్లీజ్. అంతా మంచే జరగాలని కోరుకుందాం.. ఇదంతా అబ్ధమే అవ్వాలని కోరుకుందాం.. మీరంతా జాగ్రత్తగా ఉండండి. దయచేసి మీ పదవుల కోసం.. మీ రాజకీయ భవిష్యత్తు కోసం తెలుగు తల్లిని అవమానించకండి" అని పాదాలకు నమస్కరిస్తూ శివాజీ తీవ్ర ఆవేదనతో మీడియాకు వివరించారు.

 


   అత్యంత ప్రమాదకర విషయాన్ని బయటపెట్టిన శివాజీ!