డ్రెస్సింగ్ రూం డోర్ పగలగొట్టింది అతనే!

Header Banner

డ్రెస్సింగ్ రూం డోర్ పగలగొట్టింది అతనే!

  Tue Mar 20, 2018 22:15        India, Sports, Telugu

నిదహాస్ ట్రోఫీలో భాగంగా శ్రీలంకతో జరిగిన ఆరో టీ-20లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు సృష్టించిన వివాదం సంచలన సృష్టించింది. చివరి ఓవర్‌లో అంపైర్లు నోబాల్స్ గమనించలేదని బంగ్లా బ్యాట్స్‌‌మెన్లు వాళ్లతో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా.. మైదానంలోకి వచ్చిన బెంచ్ ఆటగాడు నురుల్ హసన్ శ్రీలంక బౌలర్ తిషారా పెరీరాతో మాటల యుద్ధానికి దిగాడు. అదే సమయంలో స్టాండ్స్‌లో ఉన్న బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబల్ హసన్ బ్యాట్స్‌మెన్లను మైదానం విడిచి రావాలంటూ పిలిచాడు. కెప్టెన్ ఆదేశాలను పాటించిన బ్యాట్స్‌మెన్లు మైదానం విడిచి వెళ్లారు. అయితే మ్యాచ్ రెఫరీ, అంపైర్లు నచ్చజెప్పడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభమై.. బంగ్లాదేశ్ 2 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్స్‌కు చేరింది.

 

అయితే మ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్ ఆటగాళ్లు తమకు ఏర్పాటు చేసిన డ్రెస్సింగ్ రూం తలపులు బద్దలుకొట్టారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. అత్యుత్సాహంలో బంగ్లాదేశ్ ఆటగాళ్లు చేసిన ఈ పనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే తలుపులు ఎవరు బద్దలుకొట్టారనే విషయంపై శ్రీలంక క్రికెట్ విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆటగాళ్లకి భోజనం అందించిన క్యాటర్స్.. బంగ్లా కెప్టెన్ షకీబల్ హసనే ఈ పని చేసినట్లు మ్యాచ్ రెఫరీ క్రిస్ బోర్డుకు వివరించారు. షకీబ్ చాలా వేగంగా తలపులు తోయడం వల్లే అవి బద్దలయ్యాయని వాళ్లు తెలిపారు. దీనిపై నిజానిజాలు తేలిన తర్వాతే తప్పు చేసిన ఈ విషయంలో చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. ఈ వివాదంపై స్పందించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు క్షమాపణ చెప్పింది. అంతేకాక.. జరిగిన నష్టాన్ని కూడా భరిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

 


   డ్రెస్సింగ్ రూం డోర్ పగలగొట్టింది అతనే!