బుకాయించే ప్రయత్నం చేసిన జనసేనాని...

Header Banner

బుకాయించే ప్రయత్నం చేసిన జనసేనాని...

  Tue Mar 20, 2018 22:13        India, Telugu

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ముఖ్యం కాదంటూ జనసేన అధినేత పవన్ చేసిన వ్యాఖ్యల తాలూకు ఫుటేజీ బయటకొచ్చింది. దీంతో పవన్ అడ్డంగా బుక్కయ్యారు. తానలా అనలేదంటూ బుకాయించే ప్రయత్నం చేసిన జనసేనానికి.. ఇంటర్వ్యూ క్లిప్ షాక్ ఇచ్చింది. న్యూస్‌ 18 చానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో పవన్ మాట్లాడుతూ... ‘‘మీరు ఏ పేరైనా పెట్టుకోండి.. ఏపీకి నిధులు కావాలి. ప్యాకేజీ ఇచ్చినా చాలు’’ అంటూ వ్యాఖ్యానించారు.

 

ప్రత్యేక హోదా ముఖ్యం కాదంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారని తెలియగానే రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు హోదా అంటూ మాట్లాడిన పవన్.. ఉన్నట్లుండి ప్యాకేజీ ఇచ్చినా చాలు అని ఎందుకు అన్నారని అందరిని నివ్వెరపోయేలా చేసింది. పవన్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే తేరుకున్న పవన్.. వివరణ పేరుతో మాట మార్చారు. తన అభిప్రాయాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, తానలా అనలేదని ట్వీట్లు చేశారు. జనసేన ప్రెస్‌నోట్లు రిలీజ్ చేసింది.

 

 


   బుకాయించే ప్రయత్నం చేసిన జనసేనాని...