చెర్రీ, ఎన్టీఆర్ బాడీనీ స్కాన్ చేయించిన జక్కన్న..!

Header Banner

చెర్రీ, ఎన్టీఆర్ బాడీనీ స్కాన్ చేయించిన జక్కన్న..!

  Fri Mar 16, 2018 21:28        Cinemas, India, Telugu

ల్టీస్టారర్ అనగానే.. కథ మొదలు, క్యారెక్టర్స్ వరకూ జనాల్లో భారీ అంచనాలు నెలకొనడం, తద్వారా రకరకాల ఊహాగానాలు తెరపైకి రావడం కామన్. ఇప్పుడో టాలీవుడ్ మల్టీస్టారర్ విషయంలోనూ ఇలాంటి కథలే వినిపిస్తున్నాయి.

 

ఓ వైపు త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ సిద్ధమవుతుంటే మరోవైపు చరణ్ ‘రంగస్థలం’ పూర్తి చేసి బోయపాటి సినిమాను స్టార్ట్ చేసేస్తున్నాడు. అయితే ఈ ఇద్దరూ ఇంకోవైపు రాజమౌళి సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు. నిన్నమొన్నటి వరకూ కేవలం ప్రచారానికే పరిమితమైన జక్కన్న తెరకెక్కించబోయే మల్టీస్టారర్.. ఈ ఇద్దరు హీరోల అమెరికా యాత్రతో క్లారిటీగా కన్ఫమ్ అయింది. కాకపోతే వీరు అమెరికా వెళ్లింది ఎందుకనేదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం.

 

రీసెంట్‌గా ఎన్టీఆర్, చరణ్ యూఎస్ వెళ్లడం, తిరిగిరావడమూ జరిగింది. ఈ భారీ ప్రాజెక్ట్‌లో వీరిద్దరూ అన్నదమ్ములుగా నటిస్తున్నారని, పోలీస్ బ్రదర్స్ అని రకరకాల వార్తలు వస్తున్నాయి. వీటి సంగతెలా ఉన్నా.. ఈ ఇద్దరూ అమెరికా వెళ్లింది మాత్రం రాజమౌళి మూవీ ప్రీ-ప్రొడక్షన్ వర్క్‌లో భాగంగానేనట. సినిమాలో ఈ ఇద్దరు హీరోలతో జక్కన్న ఎలాంటి స్టంట్స్ చేయిస్తాడో కానీ ప్రస్తుతానికైతే ఇందుకోసం వీరిని యూఎస్‌లో ఫుల్ బాడీ స్కానింగ్ చేయించాడట.

 

హాలీవుడ్ యాక్షన్ మూవీస్‌లో ఇటీవల మోషన్ క్యాప్చరింగ్ టెక్నాలజీని వాడటం కామన్ అయింది. ఎన్టీఆర్-రామ్ చరణ్ యూఎస్ వెళ్లి అక్కడ బాడీ స్కానింగ్ చేయించింది ఇందుకోసమేనట. ముఖ కవలికలతో పాటు బాడీ మూమెంట్స్‌ను స్కాన్ చేసి రిస్కీ స్టంట్ సీన్స్‌లో ఈ గ్రాఫికల్ విజువల్స్ ఉపయోగిస్తారు. అక్టోబర్‌లో ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఈలోపు యాక్షన్ సీన్స్‌కు సంబంధించిన గ్రాఫిక్ వర్క్ సిద్ధం చేయనున్నాడట జక్కన్న. 'ఈగ', 'బాహుబలి' తరహా సినిమాలు కాకుండా గ్రాఫిక్స్‌తో సంబంధం లేని సినిమా చేస్తానన్నాడు రాజమౌళి. అయినా ఉన్న కొద్ది గ్రాఫిక్ షాట్స్‌కి సంబంధించి ఈసారి ఆరునెలల ముందే పని మొదలెడుతున్నాడు కనుక షూటింగ్ తర్వాత ఆలస్యం కాకపోవచ్చేమో.. చూద్దాం ఏం జరుగుతుందో.

 


   చెర్రీ, ఎన్టీఆర్ బాడీనీ స్కాన్ చేయించిన జక్కన్న..!