లోక్‌సభలో లెక్కలివీ...!

Header Banner

లోక్‌సభలో లెక్కలివీ...!

  Fri Mar 16, 2018 21:11        అమరావతి కబుర్లు, India, Telugu

 బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ తప్పుకోవడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నా... సంఖ్యాబలం పరంగా చూసినప్పుడు మోదీ సర్కార్‌కు ఇప్పటికిప్పుడు వచ్చే ప్రమాదం ఎంత మాత్రం లేదు. అయితే టీడీపీ 'కటీఫ్'తో రాజ్యసభలో మాత్రం ప్రభుత్వంపై ఎక్కువ ప్రభావమే ఉంటుంది.

 

తెలుగుదేశం పార్టీకి పార్లమెంటు ఉభయ సభల్లో 22 ఎంపీల బలం ఉంది. ఇందులో 16 మంది లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆరుగురు రాజ్యసభలో ఉన్నారు. తాజాగా ఎన్డీయేకు టీడీపీ మద్దతు ఉపసంహరించుకుంది. తద్వారా ఎన్డీయే ప్రభుత్వ సుస్ధిరతకు వచ్చే ప్రమాదం ఇప్పటికిప్పుడైతే లేదు. బీజేపీకి సొంతంగానే 274 మంది ఎంపీల బలం ఉంది. ప్రభుత్వం నిలుపుకొనేందుకు, అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 272. అంటే సునాయాసంగా, సొంతబలంతోనే బీజేపీ నెగ్గుకురాగలదు.

 

2014 సార్వత్రిక ఎన్నికల్లో 282 ఎంపీలను గెలుచుకోవడం ద్వారా బీజేపీ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే స్థితికి చేరింది. అయినప్పటికీ ఎన్నికల ముందు తమతో పొత్తు పెట్టుకున్న పార్టీలతో కలిసి ఎన్డీయే ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేసింది. ఆ ప్రకారం భాగస్వామ్య పక్షాలతో కలిసి లోక్‌సభలో ఎన్డీయే సభ్యుల బలం 331గా ఉంది. శుక్రవారం ఉదయం నాటికి రాజ్యసభలో బలం 79. తాజాగా ఎన్డీయేకు టీడీపీ ఉద్వాసన చెప్పడంతో ఎన్డీయే బలం 315కు తగ్గగా, రాజ్యసభలో బలం 73గా ఉంది. ఆ ప్రకారం మోదీ ప్రభుత్వానికి లోక్‌సభలో ఇప్పటికిప్పుడు వచ్చిపడే ప్రమాదం ఏమీ లేదు. బహుశా ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ నిరసనలు చేసినా, అవిశ్వాసతీర్మానంతో ముందుకెళ్లాలని ప్రయత్నం చేసినా బీజేపీ మిన్నకుండటానికి ఇదో బలమైన కారణం కావచ్చు. ఇక ఆయా పార్టీల బలాబలాలు ఒకసారి చూస్తే...

 

ఎన్డీయే సభ్యుల బలాబలాలు

భారతీయ జనతా పార్టీ : 274 లోక్‌సభ, 58 రాజ్యసభ

శివసేన : 18 లోక్‌సభ

లోక్ జనశక్తి పార్టీ : 6

శిరోమణి అకాలీ దళ్ : 4 లోక్‌సభ, 3 రాజ్యసభ

రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ : 3

జనతాదళ్ (యునైటెడ్) : 2 లోక్‌సభ, 7 రాజ్యసభ

ఇండియన్ నషనల్ లోక్ దళ్ : 2

అప్నాదళ్ : 2

జమ్ము కశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ : 1

సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ : 1

పాట్టాలి మక్కల్ కట్చి : 1

ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ : 1

నేషనల్ పీపుల్స్ పార్టీ : 1

 

రాజ్యసభలో ఎన్డీయే సభ్యుల బలాబలాలు

భారతీయ జనతా పార్టీ : 54

జనతాదళ్ (యునైటెడ్) : 7

శిరోమణి అకాలీ దళ్ : 3

శివసేన : 3

జమ్ముకశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ : 2

ఇండియన్ నేషనల్ లోక్ దళ్ :1

సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ : 1

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ) : 1

నాగా పీపుల్స్ ఫ్రంట్ : 1

 


   లోక్‌సభలో లెక్కలివీ...!