పాడుబడ్డ బావిలో కుప్పగా ఆధార్ కార్డులు

Header Banner

పాడుబడ్డ బావిలో కుప్పగా ఆధార్ కార్డులు

  Wed Mar 14, 2018 22:19        అమరావతి కబుర్లు, India, Telugu

ఓ వైపు ఆధార్ కార్డులోని సమాచారం గోప్యతపై దేశ వ్యాప్తంగా రచ్చ జరుగుతుంటే.. మరోవైపు అవే ఆధార్ కార్డులు పాతబడ్డ బావిలో కుప్పలు కుప్పలుగా దర్శనమిచ్చాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని యావత్మల్‌లో వెలుగుచూసింది. యావత్మల్ పట్టణ శివార్లలో ఉన్న పాడుబడ్డ బావిని శుభ్రం చేసేందుకు కొందరు స్థానిక యువకులు బావిలోకి దిగారు. బావిలో దిగిన యువకులకు కుప్పగా పోసిన ఆధార్ కార్డులు కనిపించడంలో షాక్ అయ్యారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. స్పందించిన జిల్లా యంత్రాంగం.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ఈ కార్డులన్నీ 2011- 14 మధ్య జారీచేసినట్లు గుర్తించారు. ఆధార్ కార్డుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.   పాడుబడ్డ బావిలో కుప్పగా ఆధార్ కార్డులు