కేసీఆర్, హరీశ్‌లపై తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేసిన రేవంత్

Header Banner

కేసీఆర్, హరీశ్‌లపై తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేసిన రేవంత్

  Tue Mar 13, 2018 22:06        India, Telugu

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి.. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌పై మరోసారి తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై రేవంత్ స్పందిస్తూ.. కేసీఆర్, హరీశ్‌రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో టీఆర్ఎస్‌ను నిలదిస్తారనే కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేశారన్నారు. కోమటిరెడ్డి, సంపత్‌ను బహిష్కరించారు సరే.. ! కేసీఆర్ మాటలను ఆయన ఇంట్లోనే ఎవరు వినరనీ.. అలాంటిది తెలంగాణలో సీఎం పత్వాను ఎవరు స్వీకరిస్తారని రేవంత్ వ్యంగ్యంగా మాట్లాడారు. శాసన సభ్యులను బహిష్కరించే అధికారం స్పీకర్‌కు లేదన్నారు. గవర్నర్ ప్రసంగంలో గొడవ జరిగింది..  కాబట్టి ఆయనకే అధికారం ఉంటుందని రేవంత్ చెప్పుకొచ్చారు.

 

కుర్చీకి ఇబ్బందని భావించే...!

స్పీకర్ రూల్స్‌‌కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. ఇది చట్టంలో నిలబడదు. చట్టసభల్లో కాంగ్రెస్ సభ్యులు ఉంటే కేసీఆర్ కుర్చీకి ఇబ్బంది అని భావించి సస్పెండ్ చేశారు. శాసన సభ్యుల సభుత్వాని రద్దు చేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు మాత్రమే ఉంటుంది. పార్టీ ఫిరాయింపులు చేసిన వారి సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేయవచ్చు"అని ఆయన స్పష్టం చేశారు.

 

సీఎం ఆరోగ్యంపై ప్రచారం చేసిందెవరు!?

సీఎం కేసీఆర్ ఆరోగ్యం బాగోలేదని.. అమెరికాలో వైద్యం చేయించుకుంటున్నారని చెప్పిందెవరు?. అమెరికా నుంచి అటే పోతారని ప్రచారం చేసింది మీ ఇంట్లో సభ్యులే. ఆయన పోతే వాల్ల కొడుకో, అల్లుడో ఎవరో ఒక్కరూ ముఖ్యమంత్రి అవుతారు. కేసీఆర్ ఆరోగ్యంపై ప్రచారం చేసింది ఎవరో విచారణకు అదేశించాలి" అని రేవంత్ డిమాండ్ చేశారు.

 

డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టండి.. కేసీఆర్ చరిత్ర ఆయనకు తెలుసు!

"మా నేత కోమటిరెడ్డి తాగివచ్చారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చెబుతున్నారు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చేటప్పుడు ముఖ్యమంత్రికి డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టండి. ఎవరు దొరుకుతారో తెలుస్తుంది. ఇక్కడేమో ధర్నా చేసే అవకాశం లేదు?.. ఢిల్లీకెళ్లి ధర్నా చేస్తారట. కేసీఆర్ నీచ చరిత్ర స్వామిగౌడ్‌, శ్రీనివాస్ గౌడ్‌లకు తెల్సు" అని రేవంత్ తీవ్ర ఆరోపణలు చేశారు.

 

కేసీఆర్ నిజ స్వరూపాన్ని బయటపెట్టడానికే..!

శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ గురించి రేవంత్ మాట్లాడుతూ.. ఒక్కసారి ఎడమ కన్నుకు.. మరో సారి కుడికన్నుకు స్వామి గౌడ్ కావాలనే పట్టీ వేయించుకున్నారని విమర్శలు గుప్పించారు. ఇదంతా కేసీఆర్ నిజ స్వరూపాన్ని బయట పెట్టడానికే చేశారన్నారు. శాసన సభ్యుల సభ్యత్వం రద్దు చేసే అధికారం మీకు లేదన్నారు. నీ సభ్యత్వం, నీ ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం ఈ నాలుగు కోట్ల ప్రజలకు ఉంది. కేటీఆర్ మామ ఎస్టీల పేరు మీద ఉద్యోగం సంపాదించి రిటైడయ్యి కూడా 52 వేల జీతం తీసుకుంటున్నారుఅని రేవంత్ ఆరోపించారు.

 

హరీశ్.. విర్ర వీగకు.. బయటికి రా!!

మంత్రి హరీశ్ గురించి ఇప్పటికే సంచలన ఆరోపణలు చేసిన రేవంత్ తాజాగా మరింత స్వరం పెంచారు. "హరీశ్.. పొడుగుగా ఉన్నావని విర్ర వీగకు. మీ మామా, బావమర్ది నీ నడ్డి విరగగొడతారు. ఇప్పటికైనా నీ బుద్ది మార్చుకొని బయటకు రావాలి. 50% మంచి పనులు చేశావు. 50 శాతం పాపాలు చేసావు . ఇకనైనా బయటకు వచ్చి పాపాల నుంచి బయటపడుఅని హరీశ్‌కు రేవంత్ సలహా ఇచ్చారు.

 

అయితే గత కొద్దిరోజులుగా రేవంత్.. టీఆర్ఎస్ సర్కార్‌పై స్పీడ్ పెంచి మరీ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతే రీతిలో టీఆర్ఎస్ నేతలు సైతం ఆయన విమర్శలను తిప్పికొడుతున్నారు. అయితే తాజా వ్యాఖ్యలపై గులాబీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

 


   కేసీఆర్, హరీశ్‌లపై తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేసిన రేవంత్