హీరోయిన్ హన్సికపై కేసు నమోదు

Header Banner

హీరోయిన్ హన్సికపై కేసు నమోదు

  Tue Mar 13, 2018 22:00        Cinemas, India, Telugu

హీరోయిన్ హన్సికపై ఆమె మేనేజర్ మునుస్వామి చీటింగ్ కేసు పెట్టడం.. కోలీవుడ్‌లో చర్చనీయాంశం అవుతోంది. హన్సిక తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందని ఆయన నడిగర్ సంఘం (తమిళ నటీనటుల మండలి)లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటికి వచ్చింది. విషయంలోకి వస్తే.. ప్రస్తుతం హన్సికకు సంబంధించిన డేట్స్, పారితోషికం వంటి విషయాలను స్వయంగా ఆమె తల్లే దగ్గరుండి చూసుకుంటుంది. అయితే అంతకు ముందు వరకు మునుస్వామి వీటన్నింటిని చూసేవారు. ఆయన్ని మేనేజర్‌గా తీసేసిన తర్వాత తనకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్‌ మొత్తాన్ని ఇవ్వకుండా.. హన్సిక, ఆమె తల్లి ఇబ్బంది పెడుతున్నారని ఆయన నడిగర్ సంఘంలో ఫిర్యాదు నమోదు చేయించినట్లుగా సమాచారం.

 

హన్సిక తనకి ఇవ్వాల్సిన డబ్బుకు సంబంధించిన అన్ని రుజువులు తన దగ్గర ఉన్నాయని, వాటి ద్వారానే కేసు నమోదు చేశానని మునుస్వామి మీడియాకి కూడా తెలపడంతో.. కోలీవుడ్ అంతా హన్సిక గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు హన్సిక ఈ విషయంలో స్పందించకపోవడంతో మునుస్వామి వాదనకు బలం చేకూరుతూ.. వివాదం మరింత ముదురుతోంది. ఇదిలా ఉంటే.. మునుస్వామితో డైరెక్ట్‌గా హన్సిక ఫోన్‌లో మాట్లాడారని, తనకి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేస్తానని, కేసును వాపస్ తీసుకోవాలని హన్సిక కోరినట్లుగా తాజాగా కోలీవుడ్‌లో టాక్ నడుస్తుంది.

 


   హీరోయిన్ హన్సికపై కేసు నమోదు