స్కూల్‌లో దారుణం.. చీకట్లో ఐదు గంటలపాటు..

Header Banner

స్కూల్‌లో దారుణం.. చీకట్లో ఐదు గంటలపాటు..

  Mon Mar 12, 2018 22:52        India, Telugu

జిల్లాలో దారుణం జరిగింది. కాగజ్ నగర్‌లో ఐదేళ్ల చిన్నారిని క్లాస్ రూమ్‌లో వదిలి స్కూల్ షట్టర్ వేసి వెళ్లిపోయారు సిబ్బంది. ఈ ఘటన స్థానిక న్యూ కేరళ స్కూల్‌లో జరిగింది. యూకేజీ చదువుతున్న చిన్నారి విశాల్‌ను క్లాస్ రూమ్‌లో ఒంటరిగా వదిలి తాళాలు వేసుకువెళ్లిపోయారు. అయితే పిల్లాడు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు.. విశాల్ ఆచూకీ కోసం ఐదు గంటలపాటు వెతికారు. అయినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో.. స్కూల్ తాళాలు తీసి చూస్తే.. అక్కడే ఉన్నాడు. దీంతో  తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. అయితే ఇంత .జరిగినా స్కూల్ యాజమాన్యం స్పందించకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురవతున్నారు.   స్కూల్‌లో దారుణం.. చీకట్లో ఐదు గంటలపాటు..