రెండు వికెట్లు కోల్పోయిన భారత్

Header Banner

రెండు వికెట్లు కోల్పోయిన భారత్

  Mon Mar 12, 2018 22:47        India, Sports, Telugu

నిదహాస్ ట్రైసిరీస్‌లో భాగంగా ఆర్.ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న నాలుగో టీ-20లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 19 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. 153 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ(11) ధనంజయ బౌలింగ్‌లో కుషల్ మెండీస్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం కీలక ఆటగాడు ధవన్(8) స్వల్ప స్కోర్‌కే మళ్లీ ధనుంజయ బౌలింగ్‌లో పెరీరాకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం భారత్ 4 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ విజయం సాధించాలంటే టీం ఇండియా ఇంకా 123 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజ్‌లో లోకేష్ రాహుల్(3), సురేష్ రైనా(3) ఉన్నారు.   రెండు వికెట్లు కోల్పోయిన భారత్