రెండు ముక్కలైన ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా

Header Banner

రెండు ముక్కలైన ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా

  Mon Mar 12, 2018 22:41        India, Telugu

పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా (ఎల్‌ఈటీ) రెండుగా చీలిపోయింది. పాకిస్థాన్‌కే చెందిన జమాత్-ఉద్-దవా(జేయూడీ)పై పాక్ ప్రభుత్వం నిషేధం విధించడంతో లష్కరే సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు లష్కరే తాయిబా సహ వ్యవస్థాపకుడు మౌలనా ఆమిర్ హమ్జా సంస్థ నుంచి బయటకు వచ్చేసి ‘జైషే మన్కఫా’ అనే మరో ఉగ్రవాద సంస్థను స్థాపించాడు.

 

ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు మౌలానా ఆమిర్ హమ్జా చాలా కావాల్సినవాడు. జేయూడీ, ఫలా-ఇ-ఇన్సానియత్ (ఎఫ్ఐఎఫ్) నడుపుతున్న హఫీజ్ సయీద్ నుంచి మౌలానాకు నిధులు అందేవి. అయితే ఇటీవల పాక్ ప్రభుత్వం హఫీజ్‌పై నిఘా పెట్టింది. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న జేయూడీ, ఎఫ్ఐఎఫ్‌లను నిషేధించి ఆస్తులను సీజ్ చేసింది. దీంతో మౌలానాకు నిధులు ఆగిపోయాయి. ఫలితంగా ఎల్‌ఈటీలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. దీంతో ఎల్‌ఈటీ నుంచి బయటకు వచ్చి మరో కొత్త పేరుతో సంస్థను ప్రారంభించి నిధుల సేకరించేందుకు మౌలానా పథకం రచించాడు. అందులో భాగంగానే లష్కరేనే చీల్చాడు. అంతేకాదు, జమ్ముకశ్మీర్‌లో దాడులకు కుట్ర పన్నుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో నిధులు అందక విలవిల్లాడిపోతున్న మౌలానా లష్కరే తాయిబాను రెండు ముక్కలు చేసి నిధుల వేట ప్రారంభించాడు.

 


   రెండు ముక్కలైన ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా