షమి వ్యవహారంపై కపిల్ దేవ్ స్పందన

Header Banner

షమి వ్యవహారంపై కపిల్ దేవ్ స్పందన

  Fri Mar 09, 2018 22:01        India, Sports, Telugu

 గత కొన్ని రోజులుగా భార్య హాసిన్ జహాన్ చేస్తున్న ఆరోపణలతో తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న టీమిండియా పేసర్ షమికి ఊహించని మద్దతు లభించింది. షమి భార్య చేస్తున్న ఆరోపణలపై స్పందించారు మాజీ క్రికెటర్ కపిల్ దేవ్. తన భర్త షమి మోసగాడని, ఇతర మహిళలతో సంబంధాలున్నాయని, ఓ పాకిస్థానీ మహిళ నుంచి డబ్బు తీసుకున్నాడని, తనను చంపడానికి ప్రయత్నిస్తున్నాడంటూ ఆమె చేస్తున్న ఆరోపణలను ఖండించారు. ఆ ఆరోపణల్లో నిజముంటే.. ఇంత ఆలస్యంగా స్పందించడమేంటని ప్రశ్నించారు. భర్త తమతో మంచిగా ఉంటే ఏమీ మాట్లాడరు.. అదే సంబంధం చెడితే ఆరోపణల వర్షం కురిపిస్తారా అని మండిపడ్డారు.

 

షమి గురించి తనకు తెలుసునని.. అతడు అలాంటి వాడు కాదని అన్నారు. హాసీన్‌ చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. షమి ఎంతో ప్రతిభ గల ఆటగాడని.. కష్టపడే మనస్తత్వం అతనిదన్నారు. ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తులో షమి తప్పు చేసినట్లు రుజువైతే దాన్ని ఎవరూ ఆమోదించలేరన్నారు.

 


   షమి వ్యవహారంపై కపిల్ దేవ్ స్పందన