యోగి రాష్ట్రంలో విరాట్ కోహ్లీకి ఓటు..!

Header Banner

యోగి రాష్ట్రంలో విరాట్ కోహ్లీకి ఓటు..!

  Fri Mar 09, 2018 21:30        Sports, Telugu

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు ఉత్తరప్రదేశ్‌ ఓటర్ల జాబితాలో దర్శనమిచ్చింది. గోరఖ్‌పూర్ ఉపఎన్నికల ఓటరు లిస్టులో ఢిల్లీకి చెందిన కోహ్లీ పేరు కనిపించడంతో అక్కడి అధికారులు కంగుతిన్నారు. కోహ్లీ ఫోటోతో పాటు పూర్తి వివరాలు కూడా పేర్కొనడంపై మరింత విస్మయం వ్యక్తమైంది. ఈ జాబితా ప్రకారం... సాహజన్వా అసెంబ్లీ నియోజక వర్గం కింద కోహ్లీ పేరు నమోదైంది. ఓటరు సంఖ్య 822గా పేర్కొన్నారు.

 

బూత్ స్థాయి అధికారి సునీతా చౌబే ఐదు రోజుల క్రితమే దీన్ని గుర్తించారు. ఈ పొరపాటు ఎలా జరిగిందన్న దానిపై విచారణకు ఆదేశించినట్టు సబ్‌డివిజినల్ మేజిస్ట్రేట్ పంకజ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఈ నెల 11న గోరఖ్‌పూర్, ఫుల్పూర్ లోక్‌సభ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. 14న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. సీఎం యోగి ఆధిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి మౌర్య తమ ఎంపీ పదవులకు రాజీనామా చేయడంతో ఇక్కడ ఉపఎన్నికలు జరుగుతున్నాయి.

 


   యోగి రాష్ట్రంలో విరాట్ కోహ్లీకి ఓటు..!