చావనైనా చస్తాను కానీ అలాంటి పని చేయను: పేసర్ షమీ

Header Banner

చావనైనా చస్తాను కానీ అలాంటి పని చేయను: పేసర్ షమీ

  Fri Mar 09, 2018 21:28        Sports, Telugu

షమీపై వరుస ఆరోపణలు చేస్తున్న ఆయన భార్య హసీన్ జహాన్ తాజాగా చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై షమీ స్పందించాడు. ఆమె ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కొట్టి పడేశాడు. అటువంటి పనులు చేయడం కంటే చావడం మేలని వ్యాఖ్యానించాడు. ‘‘దేశానికి ఆడుతున్నప్పుడు నేను రాజీపడినట్టు ఆరోపిస్తున్నారు. అటువంటివి చేయడం కంటే చావడం మేలు’’ అని షమీ పేర్కొన్నాడు. హసీన్, ఆమె కుటుంబ సభ్యులు కూర్చుని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకుందామని చెబుతూ వచ్చారని, కానీ ఆమెను ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారో తనకు తెలియదని షమీ పేర్కొన్నాడు. ప్రస్తుతం షమీ ఇండియా-ఎ తరపున దేవధర్ ట్రోఫీలో ఆడుతున్నాడు.

 

హసీన్ జహాన్ ఫిర్యాదుపై కోల్‌కతా పోలీసులు పలు సెక్షన్ల కింద షమీ, ఆయన సోదరుడిపై గృహహింస, హత్యాయత్నం, రేప్ కేసులు నమోదు చేశారు. ఇందులో కొన్ని నాన్ బెయిలబుల్ కేసులు కాగా, మరికొన్నింటిలో నేరం రుజువైతే పదేళ్లకుపైగా శిక్ష పడే అవకాశం ఉంది.

 


   చావనైనా చస్తాను కానీ అలాంటి పని చేయను: పేసర్ షమీ