కుప్పకూలిన సఫారీలు.. విజయం ముంగిట భారత్

Header Banner

కుప్పకూలిన సఫారీలు.. విజయం ముంగిట భారత్

  Sun Mar 04, 2018 21:39        India, Sports, Telugu

మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా కింగ్స్‌మెయిడ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం ముంగిట నిలిచింది.. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నిర్ధేశించిన విజయలక్ష్యాన్ని చేధించడంలో సఫారీ ఆటగాళ్లు విఫలమయ్యారు. మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 351 పరుగుల చేసి ఆలౌట్ అయింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా కేవలం 162 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 189 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 227 పరుగులు చేసి సౌతాఫ్రికాకు 417 పరుగుల టార్గెట్‌ని ముందుంచింది. ఈ భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన సఫారీ జట్టు ఆటగాళ్లు ఆసీస్ బౌలర్ల ధాటికి స్వల్పస్కోర్‌కే కుప్పకూలిపోయారు. ఓపెనర్ మార్క్‌రం(143), కీలక ఆటగాడు డికాక్(81) మినహా మిగితా వారందరూ సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. దీంతో నాలుగో రోజు ఆట ముగిసేసమయానికి సౌతాఫ్రికా 9 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది. క్రీజ్‌లో డికాక్(81), మోర్కెల్(0) ఉన్నారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే సౌతాఫ్రికా 1 వికెట్‌తో 124 పరుగులు చేయాల్సి ఉంది.   కుప్పకూలిన సఫారీలు.. విజయం ముంగిట భారత్