మెగాస్టార్ చిరంజీవి.. మెగా రికార్డ్

Header Banner

మెగాస్టార్ చిరంజీవి.. మెగా రికార్డ్

  Sat Mar 03, 2018 22:48        Cinemas, India, Telugu

మెగాస్టార్ చిరంజీవి స్టామినా ఏంటో మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీకి తెలిసేలా చేసింది.. ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘సైరా నరసింహారెడ్డి చిత్రం’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్ర డిజిటల్ రైట్స్‌ని అమెజాన్ ప్రైమ్ సంస్థ ఏకంగా 30 కోట్లు ఇచ్చి టోటల్ ఇండియా మొత్తం రైట్స్‌ని సొంతం చేసుకుందట. ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ వరకు మేకింగ్ వీడియోలు అన్నీ హక్కులు దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ ఇంత మొత్తం ఇచ్చి ఓ సినిమాను కొనడం ఇదే మొదటిసారి.

 

భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు కూడా మాములుగా లేవు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్‌కి రెడీ అవుతుంది. అయితే చిత్రీకరణ జరుగుతుండగానే ఇటువంటి ఆఫర్ రావడంతో సోషల్ మీడియా అంతా చిరు స్టామినా ఇదంటూ ఈ వార్త ట్రెండ్ అవుతుండటం విశేషం. ‘మెగాస్టారా.. మజాకా, చిరంజీవికే ఆ సత్తా ఉంది, వన్ అండ్ ఓన్లీ చిరంజీవి’ అంటూ సోషల్ మీడియాలో ఆయన అభిమానులు చిరు జపం చేస్తున్నారు.

 


   మెగాస్టార్ చిరంజీవి.. మెగా రికార్డ్