రామ్ చరణ్ నెంబర్ వన్ కాదు.. నెంబర్ 3

Header Banner

రామ్ చరణ్ నెంబర్ వన్ కాదు.. నెంబర్ 3

  Fri Mar 02, 2018 22:51        Cinemas, India, Telugu

టైటిల్ చూసి ఇదేదో టాలీవుడ్ నెంబర్ వన్ స్థానానికి సంబంధించినది అనుకుంటే పొరబాటే. ఎందుకంటే చిరంజీవి తర్వాత టాలీవుడ్‌లో నెంబర్ వన్ ఫొజిషన్ ఏ హీరోని వరించలేదు. మళ్లీ చిరంజీవి సినిమాలు చేస్తున్నారు కాబట్టి.. ఆ నెంబర్ వన్ స్థానం గురించి ఇప్పుడసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. మరి రామ్ చరణ్ నెంబర్ 3 మ్యాటరేంటి?

 

విషయంలోకి వస్తే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఆడియో రైట్స్ 1.6 కోట్లకు అమ్ముడు పోయి నాన్ బాహుబలి లిస్ట్‌లో టాలీవుడ్‌లో ఈ స్థాయిలో అమ్ముడుపోయిన చిత్రాలలో మూడో స్థానంలో నిలిచింది. ఈ చిత్రం కంటే ముందు పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’ 2 కోట్లు, మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ 2 కోట్లతో 1, 2 స్థానాలను ఆక్రమించుకున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ‘రంగస్థలం’ చిత్రంలోని రెండు పాటలు ఇప్పటికే విడుదలై సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తుంటే.. ఆడియో రైట్స్ రూపంలో కూడా ఈ సినిమా రికార్డు క్రియేట్ చేసి.. టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది.

 


   రామ్ చరణ్ నెంబర్ వన్ కాదు.. నెంబర్ 3