‘కాలా’ టీజర్‌పై క్రికెటర్ ప్రశంసల వర్షం

Header Banner

‘కాలా’ టీజర్‌పై క్రికెటర్ ప్రశంసల వర్షం

  Fri Mar 02, 2018 22:31        India, Sports, Telugu

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘కాలా’ చిత్రం టీజర్‌ని చిత్ర యూనిట్ గురువారం విడుదల చేశారు. పా రంజిత్ దర్శకత్వంలో రజినీకాంత్ అల్లుడు ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తాజాగా విడుదలైన కాలా టీజర్ రజనీ అభిమానులు విపరీతంగా ఆకట్టుకుంటుంది. దీనిపై టీం ఇండియా క్రికెటర్ మురళీ విజయ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ‘‘తలైవా మీరు స్టైల్ సూచిని నిలకడగా పెంచుతూపోతున్నారు. స్టైల్ అన్ని సీజన్‌లో అలాగే ఉంటుంది. నగరాన్ని కాలా రంగు పులుముకుంది’’ అంటూ విజయ్ ట్వీట్ చేశాడు.   ‘కాలా’ టీజర్‌పై క్రికెటర్ ప్రశంసల వర్షం