ఆ విషయం చెప్పరే.. అభిమానుల ఆగ్రహం

Header Banner

ఆ విషయం చెప్పరే.. అభిమానుల ఆగ్రహం

  Fri Mar 02, 2018 22:01        Cinemas, India, Telugu

 ఆలిండియా లేడీ సూపర్ స్టార్ శ్రీదేవి అంత్యక్రియలు ముగిసినా.. ఆమె మరణం చుట్టూ అలుముకున్న అనుమానాలు నివృతి కావడం లేదు. తమ ఆరాధ్యనటి మృతిపై స్పష్టత ఇవ్వడం లేదని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె చనిపోయిన నాటి నుంచి రకరకాల ఊహాగానాలు వినిపించినా.. ఆమెది ప్రమాదవశాత్తు మరణమని దుబాయ్ దర్యాప్తు సంస్థలు తేల్చిపారేశాయి. అయితే దీనిపైనే క్లారిటీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఆమె స్పృహ కోల్పోవడానికి కారణాలు తెలపకుండా కేస్ క్లోజ్ చేసినట్టు ఎలా చెపుతారని మండిపడుతున్నారు. దీనిపై మళ్లీ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

 

సినీ నటి శ్రీదేవి గత ఫిబ్రవరి 24న అర్ధరాత్రి దుబాయ్‌లోని ఓ హోటల్‌లో చనిపోయారన్నవిషయం తెలిసిందే. తొలుత గుండెపోటుతో చనిపోయారని ఆమె బంధువులు ప్రకటించగా... ఆ విషయాన్ని అక్కడి ఫోరెన్సిక్ నిపుణులు కొట్టిపడేశారు. ఆమె బాత్ టబ్‌లో ప్రమాదవశాత్తు పడిచనిపోయారని తెలిపారు. దుబాయ్ చట్టాల ప్రకారం... పూర్తి విచారణ అనంతరం 27న ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆ మర్నాడు ఫిబ్రవరి 28న విలే పార్లే శ్మశాన వాటికలో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు.. అశేష అభిమానులు తరలిరాగా ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.

 


   ఆ విషయం చెప్పరే.. అభిమానుల ఆగ్రహం