రాజమౌళి మళ్లీ ఎందుకెళ్లారు..?

Header Banner

రాజమౌళి మళ్లీ ఎందుకెళ్లారు..?

  Thu Mar 01, 2018 22:33        Cinemas, Kuwait, Telugu

 దర్శక ధీరుడు రాజమౌళి ‘రంగస్థలం’ సెట్‌కి వెళ్లారు. తన అసిస్టెంట్లతో కలిసి షూటింగ్ సెట్ మొత్తాన్ని పరిశీలించారు. దర్శకుడు సుకుమార్ గ్రామీణ నేపథ్యంలో ‘రంగస్థలం’ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం భారీ ఖర్చుతో హైదరాబాద్‌లో విలేజ్ సెట్ ఏర్పాటు చేసి సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా రాజమౌళి ఆ సెట్‌కు వెళ్లారు. దీంతో దర్శకుడు సుకుమార్ స్వయంగా రాజమౌళికి సెట్ మొత్తం చూపించారు.

 

ఈ సెట్ రాజమౌళికి చాలా బాగా నచ్చిందట. దీంతో సుకుమార్‌ని అభినందించారట. సెట్ విషయంలో సుకుమార్ చూపిన శ్రద్ధని మెచ్చుకున్నారట. అయితే రాజమౌళి ఈసెట్‌కు వెళ్లడంపై ఆసక్తి నెలకొంది. దర్శకుడు రాజమౌళి.. ఎన్టీఆర్, చరణ్ మల్టిస్టారర్ మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గ్రామీణ నేపథ్యంలో ఉంటుందట. సుకుమార్ వేసిన సెట్ ఉపయోగపడుతుందా..? అనే విషయాన్ని పరిశీలించడానికి అక్కడికి వెళ్లారని టాక్ వినిపిస్తుంది. మరీ ఎంత వరకు నిజమన్నది వేచి చూడాలి. కాగా గతంలో చిరంజీవితో కలిసి రాజమౌళి ఇలాగే ‘రంగస్థలం’ సెట్‌కు వెళ్లారు.

 

 


   రాజమౌళి మళ్లీ ఎందుకెళ్లారు..?