శ్రీదేవి కుమార్తెలను చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు..

Header Banner

శ్రీదేవి కుమార్తెలను చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు..

  Wed Feb 28, 2018 22:06        Cinemas, India, Telugu

‘మానవా ఇక సెలవ్..’ అంటూ అందాల దేవత అందనంత దూరాలకు వెళ్లిపోయింది. అశ్రునయనాల మధ్య కొద్ది సేపటి క్రితం శ్రీదేవి అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. అయితే తల్లిగా తన బాధ్యతలను తీర్చకుండానే హఠాత్తుగా వెళ్లిపోయిన శ్రీదేవి ఆత్మ తన కూతుర్ల చుట్టూనే తిరుగుతూ ఉంటుందని, కూతుర్లంటే శ్రీదేవికి అంత ప్రేమని.. శ్రీదేవిని చివరి చూపు చూసిన వారంతా అంటున్నమాట.

 

అయితే తమ కోసం పరితపించిన అమ్మ శాశ్వత నిద్రలోకి జారుకోవడంతో కుమార్తెలు ఖుషి, జాన్విల శోకానికి అంతులేకుండా పోయింది. ఇద్దరూ తల్లడిల్లిపోతున్నారు. గారాభంగా, తమకు ఏది కావాలో అది అడగకుండానే ఇవ్వడమే కాకుండా, తమకు ఎంతో స్వేచ్ఛనిచ్చిన తల్లి ఇక పక్కన లేదనే విషయం నిజంగా ఇతరులనే కలిచివేస్తుంది. మరి వారి హృదయవేదన ఇంకెంతలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే శ్రీదేవి మృతి తర్వాత జాన్వీ, ఖుషిలకు సంబంధించి ఒక్క పిక్ కూడా బయటికి రాలేదు. తాజాగా తల్లి భౌతికకాయం వద్ద తన తండ్రి ఓదార్పులో ఉన్న జాన్వీ, ఖుషిల ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ ఫొటోలో వారిద్దరిని చూస్తున్న వారంతా కన్నీటిపర్యంతమవుతున్నారు.

 


   శ్రీదేవి కుమార్తెలను చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు..