వాళ్లిద్దరూ అదరగొడితే.. ఈసారి కప్ హైదరాబాద్‌దే!

Header Banner

వాళ్లిద్దరూ అదరగొడితే.. ఈసారి కప్ హైదరాబాద్‌దే!

  Mon Feb 19, 2018 22:21        India, Telugu

ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ-20 మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ధవన్, భువనేశ్వర్‌లది కీలక పాత్ర.  బ్యాటింగ్‌లో శిఖర్ ధవన్ 39 బంతుల్లోనే 72 పరుగులు చేయడంతో టీం ఇండియా 203 పరుగులు భారీ స్కోర్ చేసింది. మరోవైపు బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్ ఫైవ్ వికెట్ హౌల్ సాధించి జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు. వీరిద్దరు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చెందిన వాళ్లు కావడం విశేషం. అయితే ఈ ఒక్క టీ-20లోనే కాదు గతంలో జరిగిన టెస్టులు, వన్డేల్లోనూ ధవన్, భువీ అద్భుతంగా రాణించారు. ఇప్పటికే.. ఐపీఎల్ 11వ సీజన్ కోసం సర్వం సిద్ధమైంది. ఈ ఏడాది ఎలాగైనా సరే కప్పు కొట్టాలని అన్ని ఫ్రాంచైజీలు హోరాహోరీగా పోటీపడుతున్నాయి.

 

ఇప్పుడు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ-20ల్లో ఇద్దరు సన్‌రైజర్స్ ఆటగాళ్లు.. చెలరేగిపోతుండటంతో ఆ జట్టు ఈసారి మరింత బలంగా బరిలోకి దిగుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరితో పాటు ఇతర కీలక ఆటగాళ్లు కూడా వారివారి జట్లలో చెలరేగిపోతున్నారు. దీంతో ఇదే దూకుడుని టోర్నమెంట్‌లో కూడా చూపిస్తే.. ఈ సారి కప్ మనోళ్లదే అని అనుకుంటున్నారు. అయితే భువీ, ధవన్‌ల తాజా ప్రదర్శనపై హైదరాబాద్ కెప్టెన్ ట్విట్టర్ వేదికగా ప్రశంసించాడు. దీంతో అభిమానులతో పాటు ఆటగాళ్లు కూడా వీరిద్దరి ప్రదర్శనపై మరింత నమ్మకం పెట్టుకున్నారని అనిపిస్తుంది.

 


   వాళ్లిద్దరూ అదరగొడితే.. ఈసారి కప్ హైదరాబాద్‌దే!