శెభాష్ మిస్టర్ పీకే: కత్తి మహేశ్

Header Banner

శెభాష్ మిస్టర్ పీకే: కత్తి మహేశ్

  Mon Feb 19, 2018 22:13        India, Telugu

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సినీ విమర్శకుడు కత్తి మహేశ్ ప్రశంసల వర్షం కురిపించారు. అవిశ్వాస తీర్మానంపై పవన్ స్పందన బేష్ అంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడు పీకే సరైన లైన్‌లోకి వచ్చారని.. తన నుంచి కోరుకునేది ఇదేనని తెలిపారు. ఆయన ఆలోచన విధానాన్ని.. అనుసరిస్తున్న వ్యూహాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నానని కత్తి చెప్పారు. ఏపీ ఎంపీలపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. అంతేకాదు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ, వామపక్షాల మద్దతు కూడగట్టి బలం పెంచుకోవాలని మహేశ్ పిలుపునిచ్చారు.   శెభాష్ మిస్టర్ పీకే: కత్తి మహేశ్