టీడీపీకి నాకు ఎలాంటి సంబంధం లేదు: పవన్

Header Banner

టీడీపీకి నాకు ఎలాంటి సంబంధం లేదు: పవన్

  Mon Feb 19, 2018 22:10        India, Telugu

అవిశ్వాస తీర్మానం టీడీపీ పెడుతుందా? లేదా? అన్నది చెప్పలేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత సవాల్‌‌కు స్పందించిన పవన్.. అవిశ్వాసం పెడితే జగన్‌‌కు అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.

 

" అవిశ్వాసం తీర్మానాన్ని జగనే దగ్గరుండి అన్నీ చేయాలి. టీడీపీ చేస్తుందా లేదా అన్నది నేను చెప్పలేను. టీడీపీ నా పార్టనర్ అయితే నేను కచ్చితంగా చెప్పేవాడ్ని.. కానీ టీడీపీకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను వాళ్లకు మద్దతు తెలిపాను అంతే. దయచేసి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అవిశ్వాసం పెట్టి ఆ క్రెడిట్ అంతా మీరే (జగన్) తీసుకుంటే నాకు సంతోషమే. ప్రజల్లో మీకు బలం పెరుగుతుంది.. బలమైన నాయకుల్లాగా ఉంటారు" అని పవన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

 


   టీడీపీకి నాకు ఎలాంటి సంబంధం లేదు: పవన్