వాలెంటైన్స్ డే సందర్భంగా భార్యకు సూపర్ గిఫ్ట్ ఇచ్చిన రోహిత్

Header Banner

వాలెంటైన్స్ డే సందర్భంగా భార్యకు సూపర్ గిఫ్ట్ ఇచ్చిన రోహిత్

  Wed Feb 14, 2018 23:05        India, Telugu

ఎట్టకేలకు రోహిత్ శర్మ హిట్టయ్యాడు. సౌతాఫ్రికా గడ్డపై బ్యాట్ ఝులిపించాడు. సెంచరీతో ఆకట్టుకున్నాడు. భారత్‌‌ను గెలిపించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌‌ అవార్డును అందుకుని.. తన భార్యకు వాలెంటైన్ డే గిఫ్ట్‌గా ఇచ్చాడు.

 

స్వదేశీ సిరీస్‌ల్లో దంచేసిన రోహిత్, సౌతాఫ్రికాతో ఐదో వన్డే ముందు వరకూ పెద్దగా పేలింది లేదు. ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరాడు. స్వదేశీ కింగ్.. విదేశాల్లో ఆడటం అవసరమా అని అభిమానులు ఫైరయ్యారు. ఆ తరువాత కీలకమైన పోర్ట్‌ఎలిజబెత్‌లో మాత్రం రోహిత్ ఫామ్‌లోకి వచ్చాడు. సూపర్ సెంచరీ చేశాడు. టీమిండియా 274 పరుగులు చేయడంలో కీరోల్ ప్లే చేశాడు. కెరీర్‌లో 17వ సెంచరీ చేసిన రోహిత్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డునూ అందుకున్నాడు. అయితే ఈ అవార్డును తన భార్య రితికకను అంకితం చేశాడు. సెంచరీ క్రెడిట్‌నూ ఆమెకే ఇచ్చాడు.

 

రితికను లవ్ మ్యారేజ్ చేసుకున్న రోహిత్, గతేడాది డిసెంబర్‌‌లో రెండో వెడ్డింగ్ యానివర్సరీ రోజునే డబుల్ సెంచరీ బాదాడు. ఆ డబుల్ సెంచరీని కూడా రితికకే బహుమతిగా ఇచ్చాడు. రితిక పుట్టిన రోజునాడు టీ-ట్వంటీల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. సూపర్ సెంచరీని తన లైఫ్‌పార్ట్‌‌‌నర్‌కు గిఫ్ట్‌గా అందించాడు.

 

ఇక రోహిత్‌‌పై సోషల్ మీడియాలో విమర్శలు కూడా వస్తున్నాయ్. కోహ్లీ, రహానె రనౌట్‌‌కు కారణమయ్యాడని అభిమానులు ఫైర్ అవుతున్నారు. అయితే కోహ్లీ రనవుట్ అయినప్పుడల్లా రోహిత్ అద్భుతంగా రాణించాడు. ఇద్దరూ కలిసి ఆడినప్పుడు ఏడు సార్లు రనౌట్ అయితే.. ఐదుసార్లు కోహ్లీయే పెవిలియన్ చేరాడు. అలా ఔటైన ప్రతిసారీ రోహిత్ చెలరేగాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయ్.

 


   వాలెంటైన్స్ డే సందర్భంగా భార్యకు సూపర్ గిఫ్ట్ ఇచ్చిన రోహిత్