ఆ విషయంపై సైలెంట్‌గా ఉండటమే బెటర్: ప్రియా ప్రకాశ్

Header Banner

ఆ విషయంపై సైలెంట్‌గా ఉండటమే బెటర్: ప్రియా ప్రకాశ్

  Wed Feb 14, 2018 22:55        Cinemas, India, Telugu

ఒక్క పాటతో ఓవర్‌నైట్ స్టార్‌డమ్ ప్రియా ప్రకాశ్ వారియర్ సొంతమైంది. ఆమె పేరును ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఆ పాటలో ఆమె హావభావాలకు నెటిజన్లు మంత్ర ముగ్దులయ్యారు. ఒక్కసారిగా వచ్చిన స్టార్‌డమ్‌తో అమ్మడు సైతం ఉబ్బితబ్బిబ్బైపోతోంది. అయితే ఈ పాటే ఆమెకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. ఆ పాట ముస్లిం మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ దేశ వ్యాప్తంగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ప్రియా ప్రకాశ్ వారియర్.. తనకు వస్తున్న పాపులారిటీతో పాటు.. పాటకు వ్యతిరేకంగా వస్తున్న ఫిర్యాదులపైనా స్పందించింది. ‘ఊహించని పాపులారిటీకి ఎలా స్పందించాలో నాకు అర్థం కావడం లేదు. కన్నుగీటే సీన్‌ను రిహార్సల్స్ చేయకుండానే.. చేశాను’ అని చెప్పుకొచ్చింది. పాటకు వ్యతిరేకంగా వస్తున్న ఫిర్యాదులపై స్పందించిన ప్రియా.. ‘ఫిర్యాదుల గురించి నాకు తెలియదని, దీనిపై సైలెంట్‌గా ఉండటమే మంచిదనిపిస్తోంది’ అంటూ పేర్కొంది.    ఆ విషయంపై సైలెంట్‌గా ఉండటమే బెటర్: ప్రియా ప్రకాశ్