పన్నెండుగుల గోడ దూకి.. రన్‌వే పైకొచ్చి..

Header Banner

పన్నెండుగుల గోడ దూకి.. రన్‌వే పైకొచ్చి..

  Tue Feb 13, 2018 22:49        India, Telugu

ఒక వ్యక్తి పన్నెండు అడుగుల ఎత్తున్న గోడను దూకి విమానాశ్రయంలోకి ప్రవేశించాడు. రన్‌వేపై పరుగులు పెట్టాడు. అయితే రాత్రి తోమ్మిది గంటలు కావడంతో అతడిని ఎవ్వరూ గుర్తించలేదు. తరువాత కొద్దిసేపటికే సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ల్యాండ్ రన్‌వే ల్యాండ్ అవుతోంది. అప్పుడు ఆ విమానం నడుపుతున్న పైలెట్ అతడిని గమనించాడు.  పైలెట్ చూస్తుండగానే అతడు ఓ విమానం టైర్‌కు నిప్పు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే అప్పటికే ఫైర్‌సేఫ్టీ అలారమ్ మోగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. అంత ఎత్తున్న గోడ దూకి లోపలికి వచ్చాడంటే అతడు ఉగ్రవాది కావచ్చని ముందుగా పోలీసులు అనుమానించారు. కానీ, అది నిజం కాదని కొద్దిసేపటికే తెలుసుకున్నారు. అతడిని లాస్‌ఏంజీల్స్‌కు చెందిన ఎడ్రోహెన్నాడ్రేజ్(31)గా గుర్తించారు. అతడికి మతిస్థిమితం లేదని పోలీసులు చెప్పారు.    పన్నెండుగుల గోడ దూకి.. రన్‌వే పైకొచ్చి..