దారుణమైన హత్య..బతకాలనే కోరికతో 19 ఏళ్ల యువతి..

Header Banner

దారుణమైన హత్య..బతకాలనే కోరికతో 19 ఏళ్ల యువతి..

  Tue Feb 13, 2018 22:32        India, Telugu

చనిపోవడానికి ముందు బతకాలనే కోరికతో ఓ యువతి ఆవేదన, ఆరాటం పోలీసులనే అబ్బురపరచింది.  చనిపోవడానికి కొద్ది నిమిషాల ముందు తన హత్యకు కారణమైన నిందితులకు సంబంధించిన కీలక సమాచారాన్ని పోలీసులకు  అందించింది. కానీ విషాదకరంగా మృత్యువాతపడింది. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో వెలుగులోకి వచ్చిన విషాదకరమైన ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 19 ఏళ్ల వయసున్న యువతిపై ఓ యువకుడు, యువతి కలిసి తీవ్రంగా దాడి చేశారు. శాన్‌ఫ్రాన్సిస్కోకు సమీపంలోని లివ్‌మోర్ దగ్గర కత్తులతో అనేకపోట్లు పొడిచారు. దీంతో యువతికి తీవ్రమైన రక్తస్రావమైంది. రక్తపు ప్రవాహంలో యువతి జుట్టు రంగుని కూడా పోలీసులు గుర్తుపట్టలేకపోయారు. ఇంత తీవ్రమైన కత్తిపోట్లతో కూడా బతకాలనే కోరికతో యువతి చేసిన పోరాటం ఆశ్చర్యపరిచింది. బాధను బరిస్తూ తీవ్రపోరాటం చేసింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులకు నిందితులకు సంబంధించిన కీలక సమాచారం అందించింది. నిందితులు ఏ మార్గంలో పారిపోయారనే విషయాన్ని చెప్పింది. అనంతరం హెలీకాఫ్టర్ ద్వారా హాస్పిటల్‌కు తరలించారు. కానీ రెండు గంటల పోరాటం తర్వాత యువతి ఊపిరి వదిలింది. రంగంలోకి దిగిన పోలీసులు యువతి ఇచ్చిన సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మరిన్ని విషయాలను రాబట్టనున్నారు. మృతురాలు, నిందితుల పేర్లు, పూర్తి వివరాలను వెల్లడించలేదు. బతకాలనే కోరికతో యువతి చేసిన పోరాటం ఆశ్చర్యకరమని పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుందన్నారు.



   దారుణమైన హత్య..బతకాలనే కోరికతో 19 ఏళ్ల యువతి..