పెద్దోళ్లంతా ఫేస్‌బుక్‌లో.. కుర్రాళ్లేమో ఇన్‌స్టా‌గ్రామ్‌లో..

Header Banner

పెద్దోళ్లంతా ఫేస్‌బుక్‌లో.. కుర్రాళ్లేమో ఇన్‌స్టా‌గ్రామ్‌లో..

  Tue Feb 13, 2018 22:03        India, Telugu

ఫేస్‌బుక్.. ఇప్పుడీ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో! అరేళ్ల పిల్లాడి నుంచి అరవై ఏళ్ల వృద్ధుడి వరకు పేస్‌బుక్ ఖాతాలున్నాయి. ఇక యువత గురించి చెప్పక్కర్లేదు. క్షణం సమయం దొరికినా వేళ్లు అటువైపు కదులుతుంటాయి. భోజనం లేకపోయినా సర్దుకోగలరేమో కానీ ఫేస్‌బుక్ చూడకుండా నిద్రపోయే యువత లేదనడంలో ఆశ్చర్యం లేదు. అయితే ఇప్పుడు ఫేస్‌బుక్ యూజర్లు క్రమంగా దీనికి దూరమవుతున్నారు. బోరు కొట్టిస్తున్న పోస్టుల యూత్‌కు తగినంత కిక్ ఇవ్వలేకపోతున్నాయి. ఫలితంగా కొత్త దారులు వెతుక్కుంటున్న యూత్ ఫేస్‌బుక్ నుంచి క్రమంగా దూరంగా జరుగుతున్నారు. క్రమంగా స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్‌లపై మళ్లుతున్నారు. ఫేస్‌బుక్‌‌ను వదిలేస్తున్న వారిలో అత్యధిక శాతం మంది 25 ఏళ్ల లోపు వారు ఉండగా, పెద్దలు మాత్రం కొనసాగుతున్నట్టు డిజిటల్ మెజర్‌మెంట్ ఫండ్ ఈమార్కెట్ పేర్కొంది.

 

అమెరికాలో 12-17 ఏళ్ల మధ్య ఉన్న వారిలో 3.4 శాతం మంది గతేడాది ఫేస్‌బుక్‌ను వదిలేసినట్టు అంచనా వేసింది. గతేడాది అమెరికాలో 12-17 ఏళ్ల మధ్య ఉన్న ఫేస్‌బుక్ యూజర్ల సంఖ్య 9.9 శాతం క్షీణించింది. 12-17 వయసు మధ్య యూజర్లు ఆరు శాతం, 12 ఏళ్ల లోపు వారిలో 9.3శాతం ఫేస్‌బుక్‌ను వదిలేసినట్టు ఈమార్కెట్ పేర్కొంది. అంతే కాదు వచ్చే రెండు మూడేళ్లలో 25 ఏళ్ల వయసున్న ఖాతాదారుల్లో 20 లక్షల మంది ఫేస్‌బుక్‌కు గుడ్‌బై చెప్పేయనున్నట్టు అంచనా వేసింది.

 

ఇక ఫేస్‌బుక్‌ను వదిలేస్తున్న వారు స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో ఖాతాలు తెరుస్తున్నారు. వచ్చే రెండు మూడేళ్లలో స్నాప్‌చాట్‌కు 19 లక్షల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లకు 18 లక్షలమంది కొత్త యూజర్లు వచ్చే అవకాశం ఉందని ఈమార్కెట్ అంచనా వేసింది. స్నాప్‌చాట్‌లో పంపిన సందేశం 24 గంటల తర్వాత కనిపించకపోవడంతో యువత అటువైపు మళ్లుతున్నట్టు పేర్కొంది.

 


   పెద్దోళ్లంతా ఫేస్‌బుక్‌లో.. కుర్రాళ్లేమో ఇన్‌స్టా‌గ్రామ్‌లో..