లైవ్‌లో మళ్లీ కత్తి దూసుకున్నారు..

Header Banner

లైవ్‌లో మళ్లీ కత్తి దూసుకున్నారు..

  Mon Feb 12, 2018 23:20        India, Telugu

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో జేఏసీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అందులో భాగంగా లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ్‌, మాజీ కాంగ్రెస్ నేత ఉండవల్లి అరుణ్‌ కుమార్‌తో పవన్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జేఏసీపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన డిబేట్‌లో పాల్గొన్న కత్తి మహేష్, జనసేన కార్యకర్త దిలీప్ సుంకుర లైవ్ వేదికగా పరస్పర దూషణలు చేసుకున్నారు.  దిలీప్ మాట్లాడుతూ కేంద్రం ఏపీకి ఏ మేరకు నిధులు ఇచ్చిందో కత్తి చెప్పగలరా? అని ప్రశ్నించారు. సినిమా ట్రిక్స్ పంచ్‌లతో ఉపయోగం లేదని దిలీప్ అనడంతో కత్తి రెచ్చిపోయారు. పవన్ కూడా సినిమావాడని, నాటకలు ఆడుతున్నది పవన్ అని కత్తి ధ్వజమెత్తారు. పర్సనల్ కామెంట్లు చేయోద్దని దిలీప్‌కు హెచ్చరించారు. పవన్‌కు ఏదీ చేతకాదని కత్తి అనడంతో దిలీప్ కూడా అదే స్థాయిలో సమాధానం ఇచ్చారు. ఆ వీడియో మీకోసం క్లిక్ చేయండి.   లైవ్‌లో మళ్లీ కత్తి దూసుకున్నారు..