తప్పు వయస్సు చూపించి.. అడ్డంగా బుక్ అయ్యాడు

Header Banner

తప్పు వయస్సు చూపించి.. అడ్డంగా బుక్ అయ్యాడు

  Mon Feb 12, 2018 22:03        India, Sports, Telugu

అండర్-19 ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించి అత్యధిక వికెట్లు తీసిన భారత పేసర్ అనుకూల్ రాయ్‌కి తాజాగా భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌ని బయటపెట్టిన లాయర్ ఆదిత్య వర్మ, అనుకుల్ తన వయస్సును తక్కువగా చూపించి జట్టులో స్థానం సంపాందించాడని, ఈ విషయం తెలిసి కూడా బీసీసీఐ తాత్కాలిక సెక్రటరీ అమితాబ్ చౌదరి అతన్ని ఇందుకు అనుమతించారని ఆరోపించారు. ఈ మేరకు ఐసీసీ, సీవోఏ ఛైర్మన్ శశాంక్ మనోహర్‌కు ఆయన లేఖ రాశారు. ‘‘ఝార్ఖండ్‌కి చెందిన రాయ్ బీసీసీఐ నిర్వహించే ఏజ్ వెరిఫికేషన్ ప్రాసెస్(ఏవీపీ)లో విఫలం అయినప్పటికీ.. అప్పడు ఝార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్‌(జేఎస్‌సిఏ)కి, బీసీసీఐకి జాయింట్ సెక్రటరీగా ఉన్న అమితాబ్ చౌదరి ఆయన పదవీబలాన్ని ఉపయోగించి రాయ్‌ని ఝార్ఖండ్ అండర్-19 జట్టులో స్థానం కల్పించారు. జేఎస్‌సిఏ ప్రెసిడెంట్ అయినా.. చౌదరి, అప్పటి సెక్రటరీ రాజేశ్ వర్మకి 2013లో నిర్వహించిన ఏవీపీలో దాదాపు 33 ఆటగాళ్లు విఫలమయ్యారని తెలుసు, వాళ్లలో రాయ్ ఒకడు. ’’ అని తెలిపారు.

 

అయితే అప్పటికే.. అనుకూల్ రాయ్‌ని బీసీసీఐ బహిష్కరించింది. కానీ చౌదరీ బీసీసీఐ సెక్రటరీ, జూనియర్ సెలెక్షన్ కమిటీ కన్వీనర్‌గా ఉండటంతో రాయ్‌ జట్టులో స్థానం దక్కించుకున్నాడు అని అన్నాడు. ఇక బీసీసీఐ సీఈవో రాహుల్ జోరీ కూడా చౌదరీ ఎలా చెబితే అలా ఆడుతున్నాడు అని ఆరోపించాడు.

 


   తప్పు వయస్సు చూపించి.. అడ్డంగా బుక్ అయ్యాడు