రాజకీయాలు నన్ను, కోహ్లీని విడదీయలేవు: ఆఫ్రిది

Header Banner

రాజకీయాలు నన్ను, కోహ్లీని విడదీయలేవు: ఆఫ్రిది

  Sun Feb 11, 2018 21:55        India, Sports, Telugu

భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే రాజకీయలు భారత క్రికెట్ టీం కెప్టెన్‌ విరాట్ కోహ్లీతో తనకున్న సంబంధాలపై ప్రభావం చూపవని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహీద్ అఫ్రిది అన్నారు. ‘‘విరాట్ కోహ్లీ ఓ అద్భుతమైన వ్యక్తి, అతన్ని స్నేహాన్ని రాజకీయాలతో ముడిపెట్టలేం. ఎదుటి వ్యక్తులను ఎంతో గౌరవిస్తాడు. నా ఫౌండేషన్‌కి తాను ప్రత్యేకంగా హాజరై, తాను సంతకం చేసిన జెర్సీని కూడా బహుకరించాడు’’ అని అఫ్రిది తెలిపాడు. ఒక క్రికెటర్లగా వేరే వ్యక్తులతో మాత్రమే కాదు.. వేరే దేశాలకు చెందిన వారితో కూడా ఎంత స్నేహంగా ఉండాలో అదర్శంగా ఉండాలని అతను అన్నాడు. పాకిస్థాన్ తర్వాత తనకు ఇండియా, ఆస్ట్రేలియా అంటే ఎంతో ఇష్టమని ఆఫ్రిది పేర్కొన్నాడు.   రాజకీయాలు నన్ను, కోహ్లీని విడదీయలేవు: ఆఫ్రిది