నాకు లెక్కలు చెప్పాల్సిందే! : పవన్ కల్యాణ్

Header Banner

నాకు లెక్కలు చెప్పాల్సిందే! : పవన్ కల్యాణ్

  Sun Feb 11, 2018 21:13        Cinemas, India, Telugu

నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటే ఏపీ ప్రజలకు న్యాయంగా ఉంటుందనే 2014లో టీడీపీ-బీజేపీకి మద్దతిచ్చినట్లు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు. పవన్-ఉండవల్లి భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ-బీజేపీ న్యాయం చేయకుంటే ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. "రాజకీయాల్లోకి రావాలని నన్ను ఎవరూ పిలవలేదు. ప్రజలు అన్యాయానికి గురయ్యారనే రాజకీయాల్లోకి వచ్చాను" అని పవన్‌ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

 

తేడా ఎక్కడుంది..లెక్కలు తేల్చండి!

కేంద్రం, రాష్ట్రం చెబుతున్న లెక్కలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయన్నారు. ప్రజల్లో ఉన్న కన్ఫ్యూజనే తనలోనూ ఉందని పవన్ చెప్పారు. " ప్రతి చిన్నదానికి గొడవ చేయడం నాకు ఇష్టంలేదు. అందుకే సంయమనం పాటించాను. ఏపీకి నిధుల విషయంలో అందరూ అబద్ధాలు చెబుతున్నారు. పోలవరం లెక్కలు ఎక్కడా కన్పించడంలేదు. ప్రత్యేక హోదా నెరవేర్చకపోవడంపై అందరిలాగే నాకూ అసంతృప్తి ఉంది" అని జనసేనాని తెలిపారు.

 

లెక్కలు ఇవ్వకపోతే..!

"నిధుల విషయంలో కేంద్రం ఒకటి చెబితే.. రాష్ట్రం మరోటి చెబుతోంది. కేంద్రం ఎంత ఇచ్చిందో రాష్ట్రం నాకు చెప్పాలి. 2014 నుంచి వివరాలు ఈనెల 15లోపు ఇవ్వాలని కోరుతున్నాను. దానిపై జాయింట్‌ ఫ్యాక్ట్స్‌ ఫైండింగ్‌ కమిటీలో చర్చిస్తాం. జాయింట్‌ ఫ్యాక్ట్స్‌ ఫైండింగ్‌ కమిటీ రాజకీయ కమిటీ కాదు. తెలంగాణ రాష్ట్రం కోరుకున్నారు అది సాకారమైంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు ఇవ్వలేదు. అందుకే ఏపీకి జరిగిన అన్యాయంపైనే నా పోరాటం"సాగిస్తున్నానని పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు.

 


   నాకు లెక్కలు చెప్పాల్సిందే! : పవన్ కల్యాణ్