తప్పకుండా 'అదుర్స్‌-2' చేస్తా: వి.వి. వినాయక్‌

Header Banner

తప్పకుండా 'అదుర్స్‌-2' చేస్తా: వి.వి. వినాయక్‌

  Wed Feb 07, 2018 20:39        Cinemas, India, Telugu

దుర్స్’.. అప్పట్లో ఈ సినిమాలో ఎన్టీఆర్ చేసిన హంగామాకు ఫిదా అయ్యారు టాలీవుడ్ ప్రేక్షకులు. 2010 వ సంవత్సరంలో వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు సీక్వల్ చేస్తానని చెబుతున్నాడు దర్శకుడు వి.వి. వినాయక్‌.

 

వి.వి. వినాయక్ దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘ఇంటిలిజెంట్‌’. ఈ చిత్రం ఫిబ్రవరి 9న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీగా ఉంది యూనిట్ అంతా. ఈ సందర్బంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వి.వి.వినాయక్‌ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఇంటర్వ్యూలో భాగంగా ‘అదుర్స్‌-2’ సినిమా ఎప్పుడు? అనే ప్రశ్న ఎదురైంది ఆయనకు. దీనిపై ఆయన బదులిస్తూ.. ‘‘రెండు మూడు కథలు అనుకున్నాం. కానీ మేం శాటిస్‌ఫై అయ్యేంతగా అన్పించలేదు. అదుర్స్‌ సినిమాని మించి ‘అదుర్స్‌-2’ తీయాలని మంచి కథ కోసం వెయిట్‌ చేస్తున్నాను. తప్పకుండా ‘అదుర్స్‌-2’ చేస్తాను’’ అని చెప్పారు.

 


   తప్పకుండా 'అదుర్స్‌-2' చేస్తా: వి.వి. వినాయక్‌