గుడ్ న్యూస్! చైనా మొబైళ్లకు ఇక చెక్!

Header Banner

గుడ్ న్యూస్! చైనా మొబైళ్లకు ఇక చెక్!

  Thu Feb 01, 2018 21:37        India, Technology, Telugu

ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మొబైల్ ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్ పరికరాలపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 20 శాతానికి పెంచడంతో ఇకపై విదేశీ మొబైళ్లు మరింత ప్రియం కానున్నాయి. చైనా నుంచి ఇబ్బడిముబ్బడిగా దిగుమతి అవుతున్న చైనా మొబైళ్లకు ఈ దెబ్బతో చెక్ పడే అవకాశం ఉందని దేశీయ మొబైల్ పరిశ్రమలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దిగుమతి సుంకం పెంచడంతో ‘మేకిన్ ఇండియా’కు మంచి రోజులు వచ్చినట్టేనని మైక్రో మ్యాక్స్ పేర్కొంది. దిగుమతి సుంకం పెంచడం ద్వారా దేశీయ మొబైల్ పరిశ్రమలో ఉత్తేజం వచ్చిందని, గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా భారత్ తయారుకావడానికి ఇది దోహదం చేస్తుందని దేశీయ మొబైల్ కంపెనీలు పేర్కొన్నాయి. ఫలితంగా దేశంలో వ్యాపారాభివృద్ధి చెంది ఉద్యోగావకాశాలు పెరుగుతాయని దేశీయ కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.   గుడ్ న్యూస్! చైనా మొబైళ్లకు ఇక చెక్!