లారాని బీట్ చేసిన విరాట్.. సెక్ట్స్ గవాస్కరే!

Header Banner

లారాని బీట్ చేసిన విరాట్.. సెక్ట్స్ గవాస్కరే!

  Sun Jan 28, 2018 21:33        India, Sports, Telugu

వాండరర్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్ట్‌ తర్వాత విరాట్ కోహ్లీ మరో అనితర సాధ్యమైన రికార్డును అధిగమించాడు. ఈ టెస్ట్‌కు ముందే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 900 పాయింట్ల సాధించిన విరాట్ కోహ్లీ.. ఈ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 54, రెండో ఇన్నింగ్స్‌లో 41 పరుగులు చేసి మరో 12 పాయింట్ల సాధించాడు. దీని ద్వారా అల్‌టైం బెస్ట్ టెస్ట్ ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ 26వ స్థానానికి చేరాడు. ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మ్యాన్ 961 పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్నారు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న కోహ్లీ మూడో టెస్ట్ తర్వాత 912 పాయింట్ల సాధించి విండీస్ క్రికెట్ దిగ్గజం బ్రెయిన్ లారా(911)ని అధిగమించాడు. లారాతో పాటు పీటర్‌సన్(909), ఆమ్లా(907), చంద్రపాల్(901), క్లార్క్(900)లను కోహ్లీ వెనక్కినెట్టాడు. అయితే ఈ జాబితాలో విరాట్ కోహ్లీ కంటే ముందు.. భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ 916 పాయింట్లతో ఉన్నారు. అయితే ఈ ఏడాది జరిగే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో విరాట్ గవాస్కర్‌ని కూడా దాటేస్తాడని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.   లారాని బీట్ చేసిన విరాట్.. సెక్ట్స్ గవాస్కరే!