ఐపీఎల్ పుణ్యమా అని కోటీశ్వరులైన అండర్-19 ఆటగాళ్లు!

Header Banner

ఐపీఎల్ పుణ్యమా అని కోటీశ్వరులైన అండర్-19 ఆటగాళ్లు!

  Sat Jan 27, 2018 22:29        India, Sports, Telugu

ఐపీఎల్ వేలంలో టీమిండియా అండర్-19 ఆటగాళ్లు రికార్డు ధరకు అమ్ముడుపోయారు. అంతేకాదు.. ఒక్క దెబ్బతో కోటీశ్వరులైపోయారు. అండర్-19 జట్టు కెప్టెన్ పృథ్వీషాను ఢిల్లీ డేర్ డెవిల్స్ రూ.1.2 కోట్లకు కొనుగోలు చేసింది. పృథ్వీ షా కోసం రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ పోటీ పడగా చివరికి రూ.1.2 కోట్లతో ఢిల్లీ డేర్ డెవిల్స్ షాను సొంతం చేసుకుంది. అలాగే అండర్-19 జట్టు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ రూ.1.8 కోట్లకు కొనుగోలు చేసింది. వీరిద్దరి కనీస ధర రూ.20 లక్షలు కాగా కోటి రూపాయలకు పైగా పలకడం విశేషం.   ఐపీఎల్ పుణ్యమా అని కోటీశ్వరులైన అండర్-19 ఆటగాళ్లు!