మరింత స్పీడు పెంచుతోన్న రాజశేఖర్

Header Banner

మరింత స్పీడు పెంచుతోన్న రాజశేఖర్

  Sat Jan 27, 2018 22:23        Cinemas, India, Telugu

కెరీర్ విషయంలో సీనియర్ హీరోలు చతికిల బడితే తేరుకోవడం కష్టం. కానీ.. కొన్నాళ్లుగా పరాజయాల్లో ఉన్న రాజశేఖర్ నూతనోత్సాహంతో దూసుకెళుతున్నాడు. ఈ ఏడాది వరుస సినిమాలతో మెప్పిస్తానంటున్నాడట రాజశేఖర్.

 

'గరుడవేగ' సినిమాతో సీనియర్ హీరో రాజశేఖర్ కెరీర్‌లో ఓ కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ రాజశేఖర్‌కు సరికొత్త ఊపునిచ్చింది. దీంతో.. గత పదేళ్ల కాలంలో ఎప్పుడూ లేనంత ఉత్సాహంగా కనిపిస్తున్నాడు రాజశేఖర్. కొత్త సినిమాల ఎంపిక విషయంలోనూ ఈ జోష్ కనిపిస్తోంది. తాజాగా మూడు సినిమాలను రాజశేఖర్ లైన్‌లో పెట్టినట్టు తెలుస్తోంది.

 

రాజశేఖర్ కమిట్ అయిన మూడు ప్రాజెక్టుల్లో రెండు సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయట. పైగా అందులో ఒకటి 'గరుడవేగ' సినిమాను నిర్మించిన జ్యో బ్యానర్‌పైనే నిర్మిస్తారట. మణిరత్నం వద్ద అసిస్టెంట్ గా వర్క్ చేసిన గోపి దర్శకత్వంలో ఈ సినిమా ఉండనుందట. ఇక మరో సినిమాకు కన్నడ దర్శకుడు నాగ శేఖర్ దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రాజశేఖర్ కీలక పాత్రను పోషించనుండగా ఆయన కూతురు శివాని హీరోయిన్ గా నటించనుంది. ఓ యంగ్ హీరోకు జంటగా శివానీ ఈ సినిమాలో కనిపించనుందట.

 

ఇక మరో సినిమాకు కూడా నిర్మాతలు సిద్ధంగానే ఉన్నప్పటికీ ఈ రెండు కంప్లీట్ చేశాక మొదలెడతాడట. మొత్తానికి ఫిబ్రవరిలో తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకునే టైమ్‌కు రెండు కొత్త ప్రాజెక్ట్ లను అనౌన్స్ చేయబోతున్నాడు రాజశేఖర్. మరోవైపు విలన్‌గానూ నటించేందుకు సిద్ధం అంటున్నాడు కనుక మరికొన్ని ప్రాజెక్ట్స్ యాడ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. మరి ఈ నూతనోత్సాహం రాజశేఖర్‌కు విజయాలను కూడా ఇస్తుందేమో చూడాలి..!

 


   మరింత స్పీడు పెంచుతోన్న రాజశేఖర్