వీటిని భ‌రిస్తూనే బ‌త‌కాలా: అన‌సూయ అవేద‌న‌

Header Banner

వీటిని భ‌రిస్తూనే బ‌త‌కాలా: అన‌సూయ అవేద‌న‌

  Fri Jan 26, 2018 21:05        Cinemas, India, Telugu

భార్య‌గా, త‌ల్లిగా త‌న వంతు పాత్ర‌ను స‌మ‌ర్థంగా పోషిస్తూనే కెరీర్ ప‌రంగానూ దూసుకుపోతోంది యాంక‌ర్ అనసూయ‌. అయితే త‌న ప‌నిని త‌న‌ని చేసుకోనీయ‌కుండా కొంద‌రు అస‌భ్యంగా వేధిస్తున్నార‌ని అన‌సూయ అవేద‌న వ్య‌క్తం చేసింది. త‌న వ‌స్త్ర‌ధార‌ణ‌ను కామెంట్ చేస్తూ నిత్యం అస‌భ్య‌క‌ర ఫోన్ కాల్స్ వ‌స్తున్నాయ‌ని తెలియ‌జేసింది. `ఇదేనా స్త్రీ స్వేచ్ఛ`? అంటూ అన‌సూయ చేసిన అవేద‌నాభ‌ర‌త‌మైన ట్వీట్ వైర‌ల్‌గా మారింది.

 

`డియర్ ఇండియా.. ఓ కూతురిగా, సోద‌రిగా, మ‌హిళ‌గా, భార్య‌గా, కోడ‌లిగా, త‌ల్లిగా నా కుటుంబ సంక్షేమం కోసం నేను క‌ష్ట‌ప‌డుతున్నా. నేను చేస్తున్న ప‌ని, నేను ధ‌రిస్తున్న దుస్తులు నా కుటుంబంపై ఎలాంటి ప్ర‌భావ‌మూ చూపడం లేదు. కానీ, ఇత‌రులు వీటి గురించి ఎక్కువ‌గా ఆలోచిస్తున్నారు. అగౌర‌వంగా, అమర్యాద‌క‌రంగా, అస‌భ్యంగా న‌న్నూ, నా కుటుంబ సభ్యుల‌ను తిడుతూ కాల్స్ చేస్తున్నారు. ప్ర‌తీరోజూ అసభ్య‌క‌ర ఫోన్స్ కాల్స్, సోష‌ల్‌మీడియా కామెంట్లు వ‌స్తున్నాయి. న‌న్ను ఆగౌర‌వ‌ప‌రిచే హ‌క్కు వారికి ఎవ‌రిచ్చారు?

 

ఓ బాధ్య‌త గ‌ల మ‌హిళ‌గా ఈ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున ఓ ప్ర‌శ్న అడ‌గ‌ద‌లుచుకున్నా.. స్వేచ్ఛ అంటే అర్థం ఇదేనా? నాకు న‌చ్చిన ప‌నిని నా ఇష్ట ప్ర‌కారం చేసుకునే స్వేచ్ఛ లేదా? స‌ంస్కృతి, సాంప్ర‌దాయం పేరిట నా గౌర‌వాన్ని కించ‌ప‌రిచే, నా ఆశ‌ల‌ను అణిచివేసే స్వేచ్ఛ ఆ అజ్ఞానుల‌కుందా? వీట‌న్నింటినీ భ‌రిస్తూనే బ‌త‌కాలా? దీని గురించి మ‌నం ఇంకేమీ చేయ‌లేమా` అని అన‌సూయ అవేద‌న‌గా ట్వీట్ చేసింది.

 


   వీటిని భ‌రిస్తూనే బ‌త‌కాలా: అన‌సూయ అవేద‌న‌