డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని ఓ మహిళ చేసిన పని..

Header Banner

డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని ఓ మహిళ చేసిన పని..

  Tue Jan 16, 2018 21:36        India, Telugu

ఒక మహిళ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఏకంగా ఏడుసార్లు అప్లై చేసుకుంది. అయితే ప్రతీసారి లైసెన్స్ పరీక్షలో ఆమె ఫెయిలయ్యింది. దాంతో ఆమె విసిగిపోయింది. ఎలాగైన లైసెన్స్ పొందాలని గట్టిగా నిర్ణయించుకుంది. నేరుగా షార్జాలోని లైసెన్స్ ఇచ్చే ఆఫీసుకెళ్లింది. అక్కడ పనిచేసే మహిళ ఉద్యోగితో పరిచయం పెంచుకుంది. తనకు లైసెన్స్ ఇప్పించాలంటూ ఆ ఉద్యోగిని కోరింది. తనకు లైసెన్స్ ఇప్పిస్తే 5వందల దర్హమ్స్‌తోపాటు ఖరీదైన చాక్లెట్లు కూడా ఇస్తానని చెప్పింది. అయితే ఆ ఉద్యోగి అలా చేయడానికి ఒప్పుకోలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో ఆ మహిళను అరెస్ట్ చేసి కోర్టులో హజరుపరిచారు. ఆమెకు కోర్టు ఆరు నెలలపాటు జైలు శిక్షను విధించింది. అంతేకాదు 5వేల దిర్హమ్స్ జరిమానాగా కట్టాలని ఆదేశించింది.     డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని ఓ మహిళ చేసిన పని..