కెనడాలో తాకా ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

Header Banner

కెనడాలో తాకా ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

  Tue Jan 16, 2018 21:32        India, Telugu

తెలుగు అలయన్స్అఫ్ కెనడా (తాకా) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. కెనడా, మిస్స్సిసాగా లోని గ్లెన్ ఫారెస్ట్ సెకండరీ స్కూల్‌ ఈ సంబరాలకు వేదికైంది. సంబరాల్లో వెయ్యి మందికి పైగా తెలుగు వారు మైనస్25 డిగ్రీల చలి వాతావరణాన్ని కూడా లెక్కచేయకుండా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తాకా కార్యదర్శి నాగేంద్ర హంసాల, మీనా ముల్పూరి, వాణి జయంతిలు కలిసి ముంతాజ్ షేక్‌ చేతుల మీదుగా దీప ప్రజ్వలన చేయించారు. తాకా కార్యక్రమానికి వచ్చిన చిన్నపిల్లలను దీపా సాయిరామ్, వాణి జయంతి భోగి పళ్ళతో మంగళ వాయిద్యాల మద్యన వారిని ఆశీర్వదించారు. అరుణ్‌కుమార్ లయం ఆధ్వర్యంలో వివిధ రకాల బొమ్మలతో ఆకర్షిణీయంగా బొమ్మల కొలువును ఏర్పరిచారు. ఈ సంబరాల్లో తాకా ఉపాధ్యక్షులు దుగ్గిన రామచంద్రరావు ప్రత్యేకంగా టొరోంటొ ఘడియలతో రూపొందించిన తెలుగు క్యాలెండర్‌ను మాజీ అధ్యక్షుడు చారి సమాంతపూడి,గంగాధర్ సుఖవాసిలచే ఆవిష్కరింపజేశారు.అంతేకాకుండా ఈ సంబరాలలో ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమానికి విక్రమ్ కొండతాశుల, శ్రీనివాస్ బొగాడి, మల్లేశ్వరి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. అచ్చ తెలుగు వంటకాలు  అరిసెలతో భోజనాలని ఏర్పాటు చేశారు.

 ఫోటోల కోసం క్లిక్ చేయండి

 

తాకా ప్రస్తుత కార్యవర్గ సభ్యులు, మాజీ అధ్యక్షులు చారి సమాంతపూడిని శాలువాతో సత్కరించారు. ఈకార్య క్రమంలో తానా కెనడా ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ సూరపనేని ఇతర కార్యవర్గ సభ్యులకు బహుమతులు అందచేశారు. అధ్యక్షులు అరుణ్ కుమార్ సంక్రాంతి ముఖ్య దాత వెంకట్ పెరుగుకు మెమంటోఅందచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలు, ఇతర లక్కీడ్రాల విజేతలకు బహుమతులు అందచేశారు. తాకా సాంస్కృతిక కార్యదర్శి  దీపా సాయిరామ్, వాణి జయంతిల ఆధ్వర్యం లో సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఉత్సాహంగా జరిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు అరుణ్ కుమార్ లయం సంక్రాంతి పండుగ విశిష్టతను, తెలుగు సంస్కృతి గొప్పదనం గురించి సభికులను వివరించారు. కెనడాలోని తెలుగు చిన్నారులు, యువతీ యువకులతో ప్రదర్శించబడిన అష్టదిగ్గజాల నృత్య ప్రదర్శన సభికులను ఎంతోఆకట్టుకున్నది. సురేష్ నిట్టల , ధీరజ్ బర్ల , సంధ్య సుస్వరధ్వని , డాన్స్ మంత్ర వారిచే నిర్వహించిన ఫ్యాషన్ షో అందరినీ ఆకట్టుకుంది.

 

ఎంతో అద్భుతంగా చేపట్టి విజయవంతం చేసిన ఫుడ్ కమిటీ సురేష్ కూన  కల్పన, డెకరేషన్ కమిటీ నాగేంద్ర హంస, రఘు అల్లం, సాంస్కృతిక కమిటి దీపా సాయిరామ్, వాణి జయంతి, క్యాలెండర్ కమిటీ గంగాధర్ సుఖవాసి, రామచంద్రరావు దుగ్గినను, రిజిస్ట్రేషన్ కమిటీ కల్పన మోటూరి, రఘు అల్లం రాంబాబు కల్లూరి తాకాఅధ్యక్షులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీ సభ్యులు బాషా షేక్, రాంబాబు కల్లూరి, కిరణ్ కాకర్లపూడి, ఆర్నాల్డ్ మద్దెలపూడి ట్రస్టీ ఛైర్మన్ లోకేష్ చిల్లకూరు, వ్యవస్థాపక సభ్యులు శ్రీనాథ్ కుందూరు, చారి సమాంతపూడి  గంగాధర్ సుఖవాసి పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. చివరిగా అందరికి ధన్యవాదాలు చెపుతూ జనగణమనజాతీయ గీతంతో కార్యక్రమాలు ముగించారు.

 

 


   కెనడాలో తాకా ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు