కోహ్లీ ఔట్.. కష్టాల్లో భారత్!

Header Banner

కోహ్లీ ఔట్.. కష్టాల్లో భారత్!

  Tue Jan 16, 2018 21:08        India, Sports, Telugu

రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 287 పరుగులు లక్ష్యాన్ని చేధించే క్రమంలో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‌ను భారత ఓపెనర్లు నిలకడగా ప్రారంభించారు. అయితే రబాడా వేసిన 8వ ఓవర్‌లో విజయ్(9) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కొంత సమయానికే మరో ఓపెనర్ రాహుల్(4) పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అనంతరం కెప్టెన్ విరాట కోహ్లీ(5) ఎంగిడి బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరగడంతో భారత జట్టు కష్టాల్లో పడింది. ప్రస్తుతం 17 ఓవర్లు ముగిసేసరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికాపై విజయం సాధించేందుకు ఇంకా 261 పరుగులు చేయాల్సి ఉంది.   కోహ్లీ ఔట్.. కష్టాల్లో భారత్!