పండగ ముగిసింది. పట్నం పిలుస్తోంది

Header Banner

పండగ ముగిసింది. పట్నం పిలుస్తోంది

  Tue Jan 16, 2018 21:03        India, Telugu

సంక్రాంతి పండగను పురస్కరించుకొని సొంతూరు వెళ్లిన ప్రజలు మళ్లీ తిరుగు ప్రయాణమయ్యారు. ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో రెగ్యులర్‌గా నడిచే 350 సర్వీసులతో పాటు విజయవాడ నుంచి హైదరాబాద్‌, విశాఖకు అదనంగా 150 బస్సులు నడిపించనున్నారు. అంతే కాకుండా రేపు మరో 150 బస్సులు అదనంగా నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక పక్క ఆర్టీసీ ఇన్ని బస్సులు నడిపిస్తునప్పటికీ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ కూడా దాదాప 100 బస్సులను నడిపించనున్నట్లు సమాచారం. ఈ సర్వీసులు ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి సర్వీసులు ప్రారంభం కానున్నాయి.   పండగ ముగిసింది. పట్నం పిలుస్తోంది