పవన్ కాళ్లకు మొక్కి సారీ చెబితే ఓకే...

Header Banner

పవన్ కాళ్లకు మొక్కి సారీ చెబితే ఓకే...

  Tue Jan 16, 2018 20:51        Cinemas, India, Telugu

పవన్ ఫ్యాన్స్‌కు, కత్తి మహేశ్‌కు మధ్య నెలకొన్న వివాదం కొత్త మలుపు తిరుగుతోంది. ఓ టీవీ ఛానెల్ లైవ్ డిస్కషన్‌లో కత్తి మహేశ్‌, జనసేన కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. వివాదానికి తెరదించాలంటే పవన్ కళ్యాణ్ ఫొటో పెట్టుకుని ఆయన కాళ్లకు దండం పెట్టి తప్పయిపోయిందని చెప్పాలని జనసేన కార్యకర్త రాజారెడ్డి కత్తి మహేశ్‌ను డిమాండ్ చేశారు. కత్తి అలా చేస్తే తాము కూడా వివాదానికి తెరదించుతామని చెప్పారు. దీనిపై మండిపడ్డ కత్తి మహేశ్.. పవన్ కళ్యాణ్‌పై రేపటి నుంచి విమర్శల యుద్ధం తీవ్రం చేస్తానని హెచ్చరించారు. తాను సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకుందామని వస్తే మళ్లీ తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ పవన్ ఫ్యాన్స్ మాట్లాడుతున్నారని కత్తి వాపోయారు. రాజారెడ్డి ఆరోపించినట్లుగా తానెప్పుడూ వైసీపీ నుంచి తానెప్పుడూ డబ్బు తీసుకోలేదని కత్తి స్పష్టం చేశారు. తాను పవన్ కళ్యాణ్ వచ్చి సారీ చెప్పాలని అడగడం లేదని, రగడ ఆపాలని ఫ్యాన్స్‌కు చెబుతూ ట్వీట్ చేస్తే చాలని కత్తి సూచించారు.    పవన్ కాళ్లకు మొక్కి సారీ చెబితే ఓకే...