ఘోర ప్రమాదం.. కారు ఇంటిపైకెక్కి..

Header Banner

ఘోర ప్రమాదం.. కారు ఇంటిపైకెక్కి..

  Mon Jan 15, 2018 22:04        India, Telugu

రాంగ్ రూట్‌లో వచ్చిన కారు రోడ్డు మధ్యలో డివైడర్‌ను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా రెండస్తుల భవనంపైకి ఎక్కింది. కాలిఫోర్నియాలోని శాంటా అన్నా కంట్రీలో ఉదయం గం.5-30నిమిషాలకు ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. కారు అతి వేగం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.  ప్రమాద సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని వారు చెప్పారు. ఒక వ్యక్తి మాత్రమే తనంతట తానుగా బయటకు రాగలిగాడని పోలీసులు తెలిపారు. మరో వ్యక్తి కారు డ్రైవర్ అని అతడిని బయటకు రప్పించేందుకు గంటపాటు శ్రమించాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. అయితే అదృష్టవశాత్తు ప్రమాదం వల్ల ఎవ్వరికీ  గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.    ఘోర ప్రమాదం.. కారు ఇంటిపైకెక్కి..