తిరిగి ప్రారంభమైన మ్యాచ్

Header Banner

తిరిగి ప్రారంభమైన మ్యాచ్

  Mon Jan 15, 2018 22:00        India, Sports, Telugu

వర్షం కారణంతో ఆగిపోయిన భారత్ -దక్షిణాఫ్రికా టెస్టు మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. వరుణుడి కారణంగా ఈ మ్యాచ్‌కు కొంతసేపు అంతరాయం కలిగింది. వర్షం ఆగిపోవడంతో దక్షిణాఫ్రికా తిరిగి మ్యాచ్ ప్రారంభించింది. ప్రస్తుతం క్రీజులో ఎల్గర్, డివిలియర్స్ ఉన్నారు. ధాటిగా ఆడిన ఏబీ డివిలియర్స్ హాఫ్ సెంచరీ చేశారు. అంతకుముందు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌లో మార్కమ్, ఆమ్లా ఒక్క పరుగుకే పెవిలియన్ చేశారు. ఆ తర్వాత వచ్చిన ఎల్గర్, డివిలియర్స్ ధాటిగా ఆడుతున్నారు. భారత బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు తీశారు. 29 ఓవర్లకి దక్షిణాఫ్రికా 2 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 333 పరుగులకు ఆలౌట్ కాగా టీమిండియా 307పరుగులు మాత్రమే చేసింది.   తిరిగి ప్రారంభమైన మ్యాచ్