కోతుల్లో భయంకరమైన వైరస్ పెరుగుతోందని..

Header Banner

కోతుల్లో భయంకరమైన వైరస్ పెరుగుతోందని..

  Mon Jan 15, 2018 21:51        India, Telugu

జనవాసాల్లో కోతులను తిరగనివ్వొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. కోతులు విసర్జించే ద్రవాల్లో భయంకరమైన వైరస్ ఉంటుందని దాంతో మనుషుల ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని వారు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోతులపై జరిపిన పరిశోధనల్లో కేవలం ఫ్లోరిడాలో ఉన్న కోతుల్లో మాత్రమే హెర్పస్ బీ అనే భయంకరమైన వైరస్ పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాంతో ఫ్లోరిడా వైల్డ్ లైఫ్ అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. కోతులతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. ఈ వైరస్ మనుషల్లో మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. అయితే ఇటువంటి కేసులు ఇప్పటివరకు ఏమి నమోదు కాలేదని అయినా ప్రజలను ముందు జాగ్రత్తగా హెచ్చరిస్తున్నట్లు వారు తెలిపారు.   Virus - Spreading by -Monkeys