ఈ నెల 17న ఢిల్లీకి సీఎం చంద్రబాబు

Header Banner

ఈ నెల 17న ఢిల్లీకి సీఎం చంద్రబాబు

  Mon Jan 15, 2018 21:41        అమరావతి కబుర్లు, India, Telugu

 ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 17న మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో 17న జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు- 2018 సన్నాహక సమావేశంలో సీఎం పాల్గొంటారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబుతో పాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటారని తెలుస్తోంది.

 

కాగా సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి, జలవనరుల శాఖ మంత్రి, హోం శాఖ మంత్రితో భేటీ అయ్యి విభజన హామీల విషయమై నిశితంగా చర్చించనున్నారు. ముఖ్యంగా పోలవరం, ఏపీకి రావాల్సిన నిధుల విషయమై ప్రధాని మోదీతో కూడా చంద్రబాబు సమావేశమవుతారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

 


   ఈ నెల 17న ఢిల్లీకి సీఎం చంద్రబాబు