స్టంపర్, ఇంపాక్ట్.. నెక్స్ట్ ఏంటో మహేష్ చెబుతున్నాడు

Header Banner

స్టంపర్, ఇంపాక్ట్.. నెక్స్ట్ ఏంటో మహేష్ చెబుతున్నాడు

  Mon Jan 15, 2018 21:36        Cinemas, India, Telugu

ఈ మధ్య టాలీవుడ్‌.. కొత్త కొత్త పేర్లకు నాంది పలుకుతుంది. పూరి జగన్నాధ్, బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన ‘పైసావసూల్’ చిత్రానికి సంబంధించిన మొదటి ట్రైలర్‌ని విడుదల చేస్తూ.. దానిని ట్రైలర్ అనకుండా స్టంపర్ అనే టైటిల్‌తో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అల్లు అర్జున్ రీసెంట్‌గా ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ టీజర్‌ని ఫస్ట్ ఇంపాక్ట్ అనే టైటిల్‌తో విడుదల చేసి మంచి రెస్పాన్స్‌ని రాబట్టుకున్నాడు. స్టంపర్, ఇంపాక్ట్ తర్వాత ఇంకా ఎలాంటి కొత్త కొత్త టైటిల్స్ టాలీవుడ్‌కి పరిచయం అవుతాయో అనుకుంటున్న వారికి మహేష్ మరో టైటిల్‌ని పరిచయం చేయబోతున్నాడు.

 

‘శ్రీమంతుడు’ చిత్రం తర్వాత మరోసారి కొరటాల శివ దర్శకత్వంలో మహేష్‌ బాబు చేస్తున్న చిత్రంకి సంబంధించిన ‘ఫస్ట్ ఓత్’..ని జనవరి 26న విడుదల చేయబోతున్నారు. ఈ విషయం కొరటాల శివ తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. ‘భరత్ అనే నేను’ టైటిల్‌గా చెప్పుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని ఆ రోజు విడుదల చేస్తున్నామని చెప్పడానికి వారు ‘ఫస్ట్ ఓత్’ అనే కొత్త పదాన్ని వాడారు. ఈ సినిమాకి రిలేటెడ్‌గా ఉన్న ఈ ఓత్ ఎలా ఉండబోతుందో తెలియదు కానీ.., ‘ఫస్ట్ ఓత్’ అంటూ వారు విడుదల చేసిన పోస్టర్‌కి మాత్రం సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. టీజర్, ట్రైలర్ అనే పదాలు మరీ రొటీన్ అనిపిస్తున్నాయేమో.. ఇలా కొత్త కొత్త పదాలతో సినిమాపై స్టార్టింగ్‌లోనే అంచనాలు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు.

 


   స్టంపర్, ఇంపాక్ట్.. నెక్స్ట్ ఏంటో మహేష్ చెబుతున్నాడు